వర్షాకాలంలో చావు రావద్దు దేవుడా

by velandi.Saikiran |

వర్షాకాలంలో చావు రావద్దు దేవుడా అంటూ జమ్మికుంట మండలంలోని వావిలాల గ్రామస్థులు మొక్కే పరిస్థితి వచ్చిం

వర్షాకాలంలో చావు రావద్దు దేవుడా
X

దిశ, జమ్మికుంట టౌన్: వర్షాకాలంలో చావు రావద్దు దేవుడా అంటూ జమ్మికుంట మండలంలోని వావిలాల గ్రామస్థులు మొక్కే పరిస్థితి వచ్చింది. ఆ ఊరిలో కట్టిన స్మశాన వాటిక చెరువు అవతల ఉంటుంది. వర్షాకాలంలో మత్తడిపడితే దాటలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక గురువారం గ్రామంలోని కుల పెద్ద మరణించాడు. అత‌న్ని దహనం చేయడానికి దారి లేకపోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మత్తడి దాటారు. అధికారులు స్పందించి, ఈ ప్రాంతంలో వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Next Story