ఓటర్ల ముంగిట అభ్యర్థుల‘వినూత్న’ బాట

by velandi.Saikiran |   (  Updated:2026-02-05 22:46:08  IST  )

​ప్రధాన పార్టీల అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు ఆయా పార్టీల కీలక నేతలు రంగంలోకి దిగడంతో ఎన్నికల వేడి మరింత పెరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ గురువారం ముమ్మరంగా ప్రచారం నిర్వహించి, పార్టీ శ్రేణుల్లో ఉత్సా హం నింపారు.

ఓటర్ల ముంగిట అభ్యర్థుల‘వినూత్న’ బాట
X

​దిశ, హుజూరాబాద్ రూరల్ : మున్సిపల్ ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు గెలు పే లక్ష్యంగా ప్రచార పర్వంలోకి దూకారు. పో లింగ్‌కు కేవలం ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండ టంతో హుజూరాబాద్ పట్టణ రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. గల్లీ గల్లీలోనూ రాజ కీయ సందడి నెలకొంది. వార్డుల్లో ఏ సందులో చూసినా అభ్య ర్థుల వినూత్న ప్రచారమే కనిపిస్తోంది. "అన్నా నమస్తే.. అవ్వ బాగున్నావా.. అక్కా నీ తమ్ముణ్ణి మర్చిపోవద్దు.. ఆపదలోనూ, సంపదలోనూ తోడుంటా.. మన గుర్తు తెలుసు కదా!" అంటూ అభ్యర్థులు ఓటర్ల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. చేతులు జోడించి ఆత్మీయంగా పలకరిస్తూ మచ్చిక చేసుకునే మాటలతో ప్రచా రాన్ని హోరెత్తిస్తున్నారు. కొందరు అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల పాదాలకు నమస్కరిస్తుంటే, మరికొందరు స్థానిక సమస్యలపై హామీల వర్షం కురిపిస్తున్నారు.

​రంగంలోకి రాజకీయ దిగ్గజాలు..

​ప్రధాన పార్టీల అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు ఆయా పార్టీల కీలక నేతలు రంగంలోకి దిగడంతో ఎన్నికల వేడి మరింత పెరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ గురువారం ముమ్మరంగా ప్రచారం నిర్వహించి, పార్టీ శ్రేణుల్లో ఉత్సా హం నింపారు. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ చార్జ్ ప్రణవ్ బాబు ఇప్పటికే మూడు వార్డుల్లో పర్యటిం చి, ప్రభుత్వ పథకాలను ప్రజ ల్లోకి తీసుకెళ్తున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సైతం ప్రతి వార్డులోని ఓటరును వ్యక్తిగతంగా కలిసేలా భారీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.

​ప్రచార రథాలు.. మైకుల హోరు..

​స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించడం పూర్తి కావడంతో అభ్యర్థులందరూ తమ తమ గుర్తులతో కూడిన ఫ్లెక్సీలు, ప్రచార వాహనాలను సిద్ధం చేసుకున్నారు. ప్రధాన పార్టీల ప్రచార రథాలు మైకులతో ఊరువాడను చుట్టేస్తున్నాయి. సమయం తక్కువగా ఉండటంతో కనీసం రెండు మూడు సార్లు అయినా ప్రతి వార్డును చుట్టేయాలని అభ్యర్థులు భావిస్తున్నారు. అనుచర గణంతో కలిసి ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా ప్రచారం సాగిస్తున్నారు.

​ఓటరు నాడి ఎటు?

​ముక్కోణపు పోటీ నెలకొన్న ఈ పురపోరులో ఓటరు నాడి ఎటువైపు ఉందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొన్ని వార్డుల్లో ఇండిపెండెంట్ లు ప్రభావం చూపే అవకాశాలు కూడా లేకపోలేదు .పార్టీల బలాబలాలు ఒకవైపు, అభ్యర్థుల వ్యక్తిగత పలుకుబడి మరోవైపు ప్రభావం చూపుతున్నాయి. ఎవరికి వారు తామే గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఓటరు మాత్రం మౌనంగా అభ్యర్థుల గుణగణాలను బేరీజు వేసుకుంటున్నారు. ఐదు రోజుల ఈ ఆఖరి పోరాటంలో ఎవరు ఓటర్లను మెప్పి స్తారో, ఎవరు పురపీఠాన్ని అధిరోహిస్తారో వేచి చూడాలి.

Next Story