బావా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పదవులు తీసుకుంటే విమర్శలు వస్తాయ్.. !

by Dishanational1 |
బావా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పదవులు తీసుకుంటే విమర్శలు వస్తాయ్.. !
X

దిశ, సిరిసిల్ల ప్రతినిధి: 14 ఏండ్లుగా టీఆర్ఎస్ లో హార్ట్ కోర్ కార్యకర్తగా పని చేస్తున్న..తాను ప్రత్యేక్ష ఎన్నికల్లో పాల్గొని పదవి ఎందుకు పొందొద్దని.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి.. సెస్ ఎన్నికల్లో తంగళ్లపల్లి డైరక్టర్ గా గెలిచి.. సెస్ చైర్మన్ పదవి సొంతం చేసుకోవాలనుకున్న మంత్రి కేటీఆర్ మేనబావ చీటీ నర్సింగరావుకు కేటీఆర్ ఓ రాజకీయ అగ్ని పరీక్ష పెట్టాడు. తంగళ్లపల్లి సెస్ ఎన్నికల బరిలోంచి తప్పించి.. చీటీ నర్సింగరావును సిరిసిల్ల పట్టణ ఇన్ చార్జీ బాధ్యతలు అప్పగించి.. టీఆర్ఎస్ బలపరుస్తున్న ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకుని తీసుకురావాలని ఆదేశించారు. గత అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన సిరిసిల్ల అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ ధార్నం లక్ష్మీనారయణ ఓటమికి పరోక్షంగా చీటీ నర్సింగరావు టీం సహకరించకపోవడమే కారణమని సిరిసిల్లలో అప్పట్లో పెద్ద చర్చ కొనసాగింది. ఇప్పుడు సెస్ సిరిసిల్ల టౌన్ 2 డైరక్టర్ స్థానంకు కూడా ధార్నం లక్ష్మీనారయణనే బరిలో ఉంచి ఈయనను గెలిపించే బాధ్యత చీటీ నర్సింగరావుపైనే పెట్టాడు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల టౌన్ లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం సిరిసిల్ల పట్టణాధ్యక్షులు జిందం చక్రపాణితోపాటు ముఖ్యులను కలుపుకుని పోవాలని చీటీకి మంత్రి కేటీఆర్ ఆదేశించినట్లు సమాచారం.


తంగళ్లపల్లిలో సెస్ మాజీ చైర్మన్ చిక్కాల రామారావును విబేధించి పోటీ చేద్దామనుకున్న చీటీ నర్సింగరావు ఇప్పుడు కేటీఆర్ ఆదేశాలతో చిక్కాల రామారావు గెలుపు కోసం పని చేస్తున్నాడు. చిక్కాలను విబేధించి వచ్చిన తంగళ్లపల్లి మండల ప్రజాప్రతినిధులను సైతం ఒప్పించి చిక్కాల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్నాడు. టౌన్ 2లో ధార్నం లక్ష్మీనారయణను గత అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో.. చిక్కాల రామారావును పద్మనాయక ఎన్నికల్లో.. ఈ సెస్ ఎన్నికల్లో విబేధించి రాజకీయ తెరపైకి వచ్చిన చీటీ నర్సింగరావుయే.. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో వీరి గెలుపు బాధ్యత తన భుజాలపైనే వేసుకోవడం.. సిరిసిల్ల పట్టణంలో రెండు స్థానాల బాధ్యత చీటీకి అప్పగించడంతో సిరిసిల్లలో పెద్ద రాజకీయ చర్చకు దారి తీసింది. నాడు ఓటమికి కారణమైన వారే..నేడు గెలుపు బాధ్యతలు భుజలపైన వేసుకుని చీటీ నర్సింగరావు సక్సెస్ అవుతారా...? మంత్రి కేటీఆర్ తన మేనబావకు చీటీకి ఓ అగ్ని పరీక్ష పెట్టారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. దీనికి తోడు సిరిసిల్ల టౌన్ 2 సెస్ డైరక్టర్ స్థానానికి బీజేపీ బలపరిచిన వ్యక్తి ఆర్థికంగా, రాజకీయంగా మంచి పేరున్న సిరిసిల్ల మాజీ ఎంపీపీ రేగులపాటి సుభాష్ రావు ను తట్టుకోవడం సాధ్యమేనా అని చర్చ జరుగుతుంది. ఈసారి సిరిసిల్ల టౌన్లో రూరల్ ఓట్లు 2 వేలకు పైగా కలవడమే కాకుండా ఇతర సామాజిక వర్గాల ఓట్లు కూడా అధికంగా ఉన్నాయి. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ధార్నం లక్ష్మీనారయణకు ఈ డైరక్టర్ స్థానంలో పోటీ చాలా గట్టిగా ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సిరిసిల టీఆర్ఎస్ లో రెబల్స్ బెడదతోపాటు గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయన్న అపవాదు ఉంది. మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యి..అందరు కలిసిపోవాలని..పార్టీ కోసం కలసికట్టుగా పని చేయాలని ఆదేశించిన సిరిసిల్ల నేతల్లో మార్పు వస్తుందా... లేదా అనేది ప్రశ్నార్థకమే.


చీటీకి ఓ రాజకీయ పరీక్షా

కేటీఆర్ మేనభావగా సిరిసిల్ల రాజకీయాల్లో చీటీ నర్సింగరావ్ తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నాడు. ఏ పదవి లేకున్నా.. సిరిసిల్ల రాజకీయాల్లో తన వాక్చాతుర్యంతో.. అనకున్న చతురతతో రాజకీయాల్లో ఒక వెలుగు వెలుగుతున్నాడు. గత కొన్ని రోజులుగా తనకు పదవి లేదని ప్రొటోకాల్ కోసం తన ప్రయత్నాలు తాను చేస్తూ.. తంగళ్లపల్లి మండలంలో సభలు, సమావేశాలు పెట్టే పరిస్థితికి వెళ్లాడు. మంత్రి కేటీఆర్ చీటీని బుజ్జగించి.. బంధువర్గం ఇప్పుడున్న పరిస్థితుల్లో పదవులు తీసుకుంటే విమర్శలు వస్తాయని చెప్పి..తర్వాత చూద్దాం అంటూ హామీ ఇచ్చి సిరిసిల్ల టౌన్ బాధ్యతలు తన మేనబావ చీటీకి అప్పగించడం చాలా వ్యూహాత్మకంగా చేశాడని రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. ఈ సెస్ ఎన్నికల్లో సిరిసిల్ల పట్టణంలో రెండు స్థానాలు గెలిస్తే చీటీ రాజకీయంగా సక్సెస్ అయ్యి.. పదవికి ఆర్హుడిగా.. లేకుంటే..14 ఏళ్ల రాజకీయాల్లో ఇప్పటికే రాజకీయ విజయాలు సాధించిననప్పటికీ.. నేటి సెస్ ఎన్నికల్లో చీటీకి సిరిసిల్ల పట్టణంలో అంతా పట్టు లేదన్న పరిస్థితులు తీసుకువచ్చే ప్రమాదం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. సిరిసిల్ల పట్టణ టీఆర్ఎస్ ముఖ్య నాయకులు చీటీతో కలిసి సమన్వయంతో పని చేస్తేనే .. సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో సక్సెస్ అవుతారని పలువురు చర్చించుకుంటున్నారు. లేకుంటే టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు అంతా ఈజీ కాదని చర్చ కొనసాగుతుంది. ఏది ఏమైనా మంత్రి కేటీఆర్ పెట్టిన ఈ రాజకీయ పరీక్షలో విజయం సాధించి కేటీఆర్ మేనబావ చీటీ నర్సింగరావ్ నెగ్గి తన రాజకీయ భౌవిష్యత్ కు ఓ పునాది వేసుకుంటాడా..? లేక కేటీఆర్ మేనబావ గానే పదవులు లేకుండా మిగిలిపోతాడా... వేచి చూడాలి.

Also Read...

భాగ్యలక్ష్మీ అమ్మవారి సమక్షంలో బండి సంజయ్‌కి రోహిత్ రెడ్డి సవాల్

Next Story

Most Viewed