- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సందిగ్ధం.. సంకోచం
గ్రామాలకు ప్రథమ పౌరుడు లేక దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయి. ఈ దశలో

సందిగ్ధం.. సంకోచం
గ్రామాల్లో యువతరం గప్ చుప్
కోర్టు నిర్ణయంతో నిర్లిప్తత
రిజర్వేషన్ల లెక్కతేలాకే
ఆలోచించాలని నిర్ణయం
దిశ, శంకరపట్నం : గ్రామాలకు ప్రథమ పౌరుడు లేక దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయి. ఈ దశలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో బీసీ కుల గణన చేపట్టింది. శాసనసభలో బిల్లు ఆమోదించి గవర్నర్ కు పంపారు. బిల్లు పెండింగ్ లో ఉండగానే ప్రభుత్వం దూకుడుగా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలను నిర్వహిస్తామని తెలపడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కసారిగా సందడి మొదలైంది. అయితే ఈ సందడి అంతా సందిగ్ధం, సంకోచంతోనే కొనసాగింది. తీరా హైకోర్టు రిజర్వేషన్లపై నాలుగు వారాలు స్టే విధించడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి చల్లారిపోయింది. ఒకవేళ తీర్పు వచ్చిన బీసీలకు అనుకూలంగా వస్తుందా ? రాదా ? సందిగ్ధం ఓ వైపు వెంటాడుతుండగా ఇక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే మండలంలోని యువతరం నాయకులు కూడా వెనకంజ వేస్తున్నట్లు జోరుగా చర్చ జరుగుతుంది. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారం మండలంలో 27 గ్రామపంచాయతీలు ఉండగా వాటిలో 13 మహిళలకు కేటాయించారు.
అదేవిధంగా ఎంపీటీసీ మొత్తం 13 స్థానాలు కాగా ఆరు మహిళలకు కేటాయించారు. కొంతమందికి ఈ రిజర్వేషన్లు షరాఘతంగా మారాయి. పోటీలో వారి సతీమణులను నిలపడానికి వెనక ముందు ఆలోచిస్తున్నారు. ఒకవేళ మహిళను నిలబెడితే భార్యాభర్తలు ఇద్దరూ తిరగాల్సి ఉంటుందని దీనివల్ల తమ జీవనోపాధి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయనే ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఇక ప్రస్తుతం ఎన్నికలు జరిగే అవకాశాలు లేకపోవడంతో జనవరి వరకు ఎన్నికలు జరిగితే రిజర్వేషన్లలో మార్పు వస్తుందని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు .ఇన్ని సందిగ్ధతలు సంకోచాల మధ్య అధికారంలోకి వస్తామా !రామా ! అనే డైలామాలో ఉన్నట్లు వినికిడి.మరోవైపు పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో సర్పంచులుగా చక్రం తిప్పిన సర్పంచులకు వారి ప్రభుత్వ హయాంలో వారు చేసిన పనులకే నేటికీ బిల్లులు రావడంలేదని ఆందోళన చెందుతున్నారు.
బిల్లులు వస్తాయో రావోనని ఆందోళన
ఇక అప్పటికి ఇప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారి పోవడంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో బిల్లులు వస్తాయని ఆశించడం కూడా ఒక రకంగా రిస్కే అని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా కొన్ని గ్రామాలలో ఉన్న యువకులు బీఆర్ఎస్ పాలన కొనసాగినన్ని రోజులు తమ ఇష్టానుసారంగా ఇతర పార్టీల నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలు ఉన్నాయి. దీంతో తాము రేపు సర్పంచిగా నిలబడి ఒకవేళ గెలిస్తే కాంగ్రెస్ శ్రేణులు కూడా అదే విధానాన్ని అనుసరించి తమను ముప్పు తిప్పలు పెట్టి ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేస్తుందని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.స్థానిక సంస్థల ఎన్నికలు ముందు నుయ్యి వెనక గొయ్యిల మారాయని ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వేషన్లు ఏ విధమైన మలుపు తిరుగుతాయో ఆ తరువాతే ఇక ఎన్నికల గురించి ఆలోచించాలని సైలెన్స్ అయిపోయారు.






