- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటరు జాబితా సవరణకు ఎస్ఐఆర్ కీలకం
ఓటర్ల జాబితా సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కీలకమని జిల్లా ఇన్ చార్జి గరిపెల్లి ప్రభాకర్ తెలిపారు.

దిశ, తంగళ్లపల్లి : ఓటర్ల జాబితా సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కీలకమని జిల్లా ఇన్ చార్జి గరిపెల్లి ప్రభాకర్ తెలిపారు. గురువారం తంగళ్లపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో బీఎల్ఎ- 2లకు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా ఇన్ చార్జి గరిపెల్లి ప్రభాకర్ మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ దేవాలయ ప్రాంగణంలో భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు ఎస్ఐఆర్ కీలక అవగాహన సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ జిల్లా ఇంచార్జ్ గరిపెల్లి ప్రభాకర్ బూత్ స్థాయిలో బీఎల్డీ - 2ల ప్రాముఖ్యత, ఎన్యూమరేషన్ ఫారాల నింపే విధానంపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఓటరు జాబితాను పూర్తిస్థాయిలో సరిచేయడానికి, అ ప్డేట్ చేయడానికి, నకిలీ ఓట్లను తొలగించడానికి చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రక్రియే ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ అని వివరించారు.
పక్కాగా ఓటర్ల వివరాలు ఓటరు జాబితాలో ఉన్న తప్పులను సరిచేయడం, చనిపోయిన వారి ఓట్లను తొలగించడం, చిరునామా మారిన వారి వివరాలను అప్డేట్ చేయడం, కొత్తగా అర్హులైన యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించడమే ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ డ్రైవ్లో భాగంగా బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహిస్తారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా జాబితా నుండి తొలగిపోకుండా ఉండాలంటే.. ఆధార్ కార్డు, ఓటరు ఐడీ, జనన ధృవీకరణ పత్రం లేదా చిరునామా రుజువు పత్రాలను సిద్ధంగా ఉంచుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలి. నకిలీ ఓట్ల నివారణ: గుర్తింపు లేని ఓట్లు, ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు చోట్ల ఓటు హక్కు ఉండటం వంటి అక్రమాలపై నిఘా ఉంచాలని, పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్ల స రైన మ్యాపింగ్ జరిగేలా చూడాలని బీఎల్ఎ- 2లకు సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనది. బూత్ స్థాయిలో బీఎల్ఎ- 2లు చురుగ్గా వ్యవహరించి, ఎలాంటి తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందేలా బాధ్యత తీసుకోవాలన్నారు.బీజేపీ మండలాధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు మాట్లాడుతూ తంగళ్లపల్లి మండల పరిధిలోని అన్ని బూత్ ల్లో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా బీజేపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పని చేస్తాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ ముఖ్య నాయకులు, శక్తి కేంద్రాల ఇంచార్ట్లు, బూత్ స్థాయి ఏజెంట్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.






