వివాహిత పై లైంగిక దాడి

by Ratna Kumari |

వివాహితను లైంగికంగా వేధించి దాడి చేసిన ఘటన వీణవంక మండలంలో చోటు చేసుకుంది.

వివాహిత పై లైంగిక దాడి
X

దిశ‌, వీణ‌వంక : వివాహితను లైంగికంగా వేధించి దాడి చేసిన ఘటన వీణవంక మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ఆవుల తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన మ్యాక లక్ష్మణ్ అనే వ్యక్తి గురువారం రాత్రి అదే గ్రామంలో నివసిస్తున్నటువంటి ఓ మహిళ ఇంటి వ‌ద్ద‌కు వెళ్లి లైంగికంగా వేధించి దాడి చేశాడని, చంపుతానని బెదిరించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Next Story