- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శాంతి భద్రత పరిరక్షణలో నిబద్ధత కలిగిన ఎస్సై వేణుగోపాల్ : సీఐ రంజిత్ రావు
శాంతి భద్రత పరిరక్షణలో నిబద్ధత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో ఎస్సైగా వేణుగోపాల్ సేవలు మరువలేనివని సీఐ రంజిత్ రావు అన్నారు.

దిశ, సుల్తానాబాద్ : శాంతి భద్రత పరిరక్షణలో నిబద్ధత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో ఎస్సైగా వేణుగోపాల్ సేవలు మరువలేనివని సీఐ రంజిత్ రావు అన్నారు. ఆదివారం పదవీ విరమణ సందర్భంగా స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ వేణుగోపాల్ చేసిన సేవలు పలువురు పోలీస్ సిబ్బంది కొనియాడారు. సీఐ రంజిత్ రావు ఎస్సై చంద్రకుమార్ వేణుగోపాల్ కు పూలమాల శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రతి పోలీస్ శారీరక దృఢత్వం కలిగి ఉండాలని, విధి నిర్వహణలో క్రమశిక్షణ నిబద్ధతతో, నైపుణ్యత కలిగి వ్యవహరించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎస్సై వేణుగోపాల్ అధికారుల ఆదేశాలను తూచ తప్పకుండా పాటించేవాడని తెలిపారు. విధి నిర్వహణలో పోలీసులు కేవలం తన డ్యూటీ కాకుండా మిగతా అన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. శేష జీవితంలో వేణుగోపాల్ సంతోషంతో గడపాలని కోరారు. ఎస్సై చంద్రకుమార్ మాట్లాడుతూ ఎస్సై వేణుగోపాల్ సేవా భావం కలిగిన వ్యక్తిగా, అందరిని కలుపు పోయే వ్యక్తిత్వం కలవాడని, పని భారం ఉంటే ఎస్సై వేణుగోపాల్ కు బాధ్యతలు అప్పజెప్పేవాడినని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. వేణుగోపాల్ ప్రతి దరఖాస్తు కు న్యాయం చేయాలనే పట్టుదల కలిగిన మానవతవాదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, మహిళ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






