- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు హుజురాబాద్‌లో 'సంసద్ క్రీడా మహోత్సవం'
ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పంతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 'సంసద్ క్రీడా మహోత్సవం' ఘనంగా నిర్వహించనున్నారు.

దిశ, హుజురాబాద్ రూరల్ : ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పంతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 'సంసద్ క్రీడా మహోత్సవం' ఘనంగా నిర్వహించనున్నారు. సోమవారం హుజురాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్‌లో అసెంబ్లీ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం కానున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి వెల్లడించారు. ఆదివారం క్రీడా మైదానంలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం కలగడమే కాకుండా యువతలో క్రమశిక్షణ పెరుగుతుందని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని యువజన సంఘాలు, డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు ఈ పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ మాడ వెంకట్ రెడ్డి, అసెంబ్లీ కోఆర్డినేటర్లు శ్రీ చేన్నమాధని నరసింహ రాజు, ఆకుల రాజేందర్, కనుమల గణపతి, పట్టణాధ్యక్షుడు తూర్పాటి రాజు, దొంతర వీణ రమేష్ యాదవ్, తిప్పబత్తి ని రాజు, కొలిపాక వెంకటేష్, మోటపోతుల రాకేష్ పాల్గొన్నారు.






