- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు వెన్నంటే ప్రభుత్వం : సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్
రైతుల వెన్నంటే తమ ప్రభుత్వం ఉంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.

దిశ, పెగడపల్లి : రైతుల వెన్నంటే తమ ప్రభుత్వం ఉంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. మండల వ్యాప్తంగా గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని మండలంలోని మద్దులపల్లి గ్రామ కొనుగోలు కేంద్రంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల వల్ల ధాన్యం తూకం ఆలస్యం అయిందని, రైతుల ఇబ్బందులకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం అని కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల మిల్లుల వద్ద స్టాక్ పేరుకుపోయి ఉందని అన్నారు. గత ప్రభుత్వంలో నాటి సీఎం వరి వేస్తే ఉరి అన్నాడని ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన అప్పటి మంత్రి రైతులు సమస్యలు చెప్పుకుంటే మిల్లర్లతో మాట్లాడుకోవాలని తప్పించుకున్నాడని తెలిపారు. తాలు పేరుతో కోత విధించారని.. కానీ అకాల వర్షం పడిన విషయం తెలుసుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.
రైతు వెన్నంటే ఉండే ప్రభుత్వం తమ ప్రభుత్వం అన్నారు. రైతు వద్దకే ప్రభుత్వం వస్తుందని ఏదైనా సమస్య ఉంటే రైతులతో నేరుగా మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో ఉన్న మిల్లుల సామర్థ్యం సరి పోకుంటే అదనంగా సిరిసిల్ల జిల్లాలో ఉన్న చేనేత గోదాములను కేటాయిస్తున్నామని తెలిపారు. జీవో కూడా విడుదల కాబోతుందని రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. తూకం విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన కేంద్రం ఇన్ చార్జిలదే పూర్తి బాధ్యత అని, ఇబ్బందులు కలిగించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
పాడి రైతుల అభివృద్ధికి కృషి
మండల వ్యాప్తంగా ఉన్న పాడి రైతుల అభివృద్ధికి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండలంలోని మద్దులపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా నిర్వహించిన పశు వైద్య శిబిరం ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశువులకు సంబంధించి ప్రభుత్వం అందజేస్తున్న సేవలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశు వైద్యశాల సబ్ సెంటర్ ల మజురుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్యాధికారి డా.ప్రకాష్, మండల పశు వైద్యాధికారి డా.హేమలత, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్, వైస్ ఛైర్మన్ సురకంటి సత్తి రెడ్డి, స్థానిక సర్పంచ్ వెల్మా బల రాం రెడ్డి, ఉప సర్పంచ్ పెంటల తిరుపతి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పురుషోత్తమ అనిల్ గౌడ్, ఉప సర్పంచ్ లు మోకినపల్లి గోపాల్, జిలా రాకేష్, కుంచె రాజేందర్, నాయకులు ఓరుగలి శ్రీనివాస్, కడారీ తిరుపతి, పూసల తిరుపతి, బండారి శ్రీనివాస్ పాల్గొన్నారు.






