ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన ఆకతాయిలు

by Elthuri vijay kumar |

హుజురాబాద్ డిపోకు చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్ పై మొలంగూర్ గ్రామ శివారులో ఆకతాయిలు దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది.

ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన ఆకతాయిలు
X

ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన ఆకతాయిలు

దిశ, శంకరపట్నం: హుజురాబాద్ డిపోకు చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్ పై మొలంగూర్ గ్రామ శివారులో ఆకతాయిలు దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది.ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ కథనం ప్రకారం... మండలంలోని మోడల్ స్కూల్ విద్యార్థులను స్కూలు విడిచిన తర్వాత వారిని తీసుకొని బస్సు మొలంగూర్ గ్రామం మీదుగా వెళ్లే క్రమంలో గ్రామ శివారులో ఎదురుగా వచ్చిన ముగ్గురు యువకులు తన పై దాడి చేసినట్లు డ్రైవర్ తెలిపాడు. దాడి చేసిన యువకులది మొలంగూరు గ్రామంగా తెలిసింది.డ్రైవర్ డయల్ 100 ఫోన్ చేయడంతో సంఘటనా స్థలానికి బ్లూ కోట్ సిబ్బంది చేరుకునే లోపే సదరు ఆకతాయిలు ద్విచక్ర వాహనాలపై ఉడాయించినట్లు సమాచారం. డ్రైవర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.

Next Story