హుజూరాబాద్ చైర్మ‌న్ అభ్య‌ర్థిత్వం కోసం రొంటాల ప్ర‌య‌త్నం

by Ratna Kumari |

హుజరాబాద్ మున్సిప‌ల్ చైర్మన్ పదవీ కోసం 30 వ వార్డు కౌన్సిలర్ రోంటాల సుహాసిని తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది.

హుజూరాబాద్ చైర్మ‌న్ అభ్య‌ర్థిత్వం కోసం రొంటాల ప్ర‌య‌త్నం
X

దిశ‌, హుజూరాబాద్ : హుజరాబాద్ మున్సిప‌ల్ చైర్మన్ పదవీ కోసం 30 వ వార్డు కౌన్సిలర్ రోంటాల సుహాసిని తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. సుహాసిని కుటుంబానికి హుజరాబాద్ లో అంతగా పరిచయాలు లేకుండా కేవలం తన మాతృ సంబంధిత పరిచయాలు మాత్రమే ఈ ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు పని చేసినట్లు తెలుస్తోంది. పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన తన మాతృ సంబంధిత వ్యక్తుల మూలంగా టికెట్ రేస్ లో ఉండి టికెట్ సాధించినప్పటికీ వార్డుల్లో కేవలం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్, డబ్బు ఇతరత్ర విషయాల మూలంగా గెలుపు సాధించినప్పటికీ చైర్మన్ రేస్ లో ఎలా నెగ్గుకు రాగలరు అనే సందేహం ప్రజల్లో కలుగుతుంది. 30 వార్డుల్లో 16 వార్డులు కాంగ్రెస్ సాధించగా నలుగురు మహిళలు గెలుపు సాధించారు. హుజురాబాద్ ఎస్సీ మహిళలకు కేటాయించడంతో ఈ పోటీకి నలుగురు అర్హత కలిగి ఉండటంతో తాము సైతం సిద్ధం అంటూ లీక్ లు ఇస్తున్నారు. పైకిమాత్రం అధిష్టానం అభీష్టం మేరకు నడుచు కుంటామనే సంకేతాలు ఇస్తున్నారు. ఫుల్ కోరం కోసం 16 మంది కౌన్సిలర్లు అవసరం ఉండగా కాంగ్రెస్ పార్టీ 16 మంది కౌన్సిలర్లు విజయం సాధించారు. ఇందులో ఒక్కరు తక్కువ ఉన్నా చైర్మన్ ఎన్నిక జరుగదు.దీంతో అధిష్టానం ఆచి తూచి వ్యవహరిస్తూ ఎవరికి ఇప్పుడే హామీ ఇవ్వకుండా క్యాంప్ కు తరలించారు.హై కమాండ్ తో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జి ప్రణవ్ బాబు తెలిపారు.

మొదలైన క్యాంప్ రాజకీయాలు

హుజురాబాద్ కాంగ్రెస్ ఖాతాలోకి చేరిపోవడంతో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను అందర్నీ హైదరాబాద్ కి ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో క్యాంపున‌కు తరలించారు. జమ్మికుంటలో 30 వార్డుల్లో బిఆర్ఎస్12, కాంగ్రెస్ 10, బీజేపీ నాలుగు, ఇండిపెండెంట్లు మూడు, ఏఐఎఫ్ బి 1సీటు సాధించగా ఇక్కడ కాంగ్రెస్,బి ఆర్ఎస్ పార్టీలు చైర్మన్ సీటుపై కన్నేసి క్యాంపు రాజకీయాలు షురూ చేశారు. బీజేపీ నాలుగు సీట్లతో తాము కీలకం కానున్న దృష్ట్యా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని తన కౌన్సిలర్లను క్యాంపున‌కు తరలించారు. దీంతో జమ్మికుంటలో కచ్చితంగా హాంగ్ ఏర్పడే అవకాశం ఉన్న దృష్ట్యా బీజేపీ కీలకం కానుంది.

Next Story