కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఉడుములెక్క వ‌చ్చిండు.. జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

by Ratna Kumari |   (  Updated:2026-04-14 15:55:34  IST  )

కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఉడుములెక్క వ‌చ్చిండు అని.. గీత గీసుకొని ఎవ‌రినీ ఎలా తొక్కాలి ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కాలి అనే ల‌క్ష్యంగా పెట్టుకున్నాడ‌ని తెలిపారు మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి.

కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఉడుములెక్క వ‌చ్చిండు.. జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
దిశ, రాయికల్ : గ‌త కొంత కాలంగా జ‌రిగిన ప‌రిణామాలు త‌న‌ను మాన‌సిక క్షోభ‌కు గురి చేశాయ‌ని.. 20 మాసాల నుంచి అంత‌ర్గ‌తంగా మ‌న హ‌క్కుల సాధ‌న కోసం పోరాటం చేశాన‌ని తెలిపారు మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి. మంగ‌ళ‌వారం రాయిక‌ల్ మండ‌లంలో నిర్వ‌హించిన కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. మున్సిప‌ల్ అభివృద్ధి ప‌నుల‌కు మున్సిపాలిటీ ఎన్నిక‌ల స‌మ‌యంలో నూత‌న అధ్య‌క్షుడు జిల్లాకు వ‌చ్చాడు. కాంగ్రెస్ స‌మావేశం ఏర్పాటు చేసుకున్నామ‌ని.. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారికి గుర్తింపు ఇవ్వాల‌ని నిర్ణ‌యించాం. కానీ రాయిక‌ల్ ప‌ట్ట‌ణానికి సంబంధించి 12 వార్డుల‌కు నాలుగు వార్డులు మాత్ర‌మే ఇచ్చారు. కుట్ర పూరితంగా 8 టికెట్లు తీసుకుంటే గెలిచింది మాత్రం ఒక్క‌టి. ఇది సిగ్గుతో త‌ల‌దించుకోవాల్సిన విష‌యం అన్నారు. కాంగ్రెస్ రాయిక‌ల్ లో కాంగ్రెస్ దిగ‌జార‌డానికి కార‌ణం ఎవ‌రు అని
ప్ర‌శ్నించారు.

దాదాపు నాలుగు ద‌శాబ్దాలుగా ఉన్న న‌న్ను పొమ్మ‌న‌లేక‌పొగ బెట్టారు. ఉన్న పార్టీని విడిచి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి పోయేవాడు ఒక‌డుంటాడు. కానీ మ‌నం ప్ర‌జా సంక్షేమం కొర‌కు ముంద‌డుగు వేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్య‌మ‌నేత‌గా కేసీఆర్ కృషి చేశారు. ప‌దేళ్లు సీఎం గా ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేశారు. ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి రైతుబంధు ఇచ్చి మూడు ఎగ్గొట్టిండు రైతుకు ఆత్మ ధైర్యం నింపిన వ్య‌క్తి కేసీఆర్ మాత్ర‌మే. కేసీఆర్ కంటే మెరుగైన పాల‌న కావాల‌ని కాంగ్రెస్ పార్టీకి అవ‌కాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు వీళ్ల‌కంటే కేసీఆర్ న‌య‌మ‌ని జ‌నాలు అంటున్నార‌ని తెలిపారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు గ్రామ అభివృద్ధికి ఒక్క‌రూపాయి అయినా ఇచ్చారా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఉడుములెక్క వ‌చ్చిండు అని.. గీత గీసుకొని ఎవ‌రినీ ఎలా తొక్కాలి ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కాలి అనే ల‌క్ష్యంగా పెట్టుకున్నాడ‌ని తెలిపారు. నా భ‌విష్య‌త్ మీ చేతిలో ఉంది. నాకు అండ‌గా నిల‌బ‌డండి. న‌న్ను ఆశీర్వ‌దించండి. భ‌విష్య‌త్ ప్ర‌యాణం క‌లిసి కొన‌సాగిద్దాం అని పేర్కొన్నారు జీవ‌న్ రెడ్డి.

Next Story