దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. చెత్త‌ను క్లీన్ చేయాల‌ని సూచ‌న

by Ratna Kumari |   (  Updated:2026-03-04 12:27:33  IST  )

దిశ దిన ప‌త్రిక‌లో 'అస్త‌వ్య‌స్తంగా పారిశుధ్యం' అనే శీర్షిక‌న క‌థ‌నం వెలువ‌డిన విష‌యం తెలిసిందే. అయితే బుధ‌వారం అధికారులు దిశ క‌థ‌నానికి స్పందించారు.

దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. చెత్త‌ను క్లీన్ చేయాల‌ని సూచ‌న
X

దిశ‌, జ‌మ్మికుంట : దిశ దిన ప‌త్రిక‌లో అస్త‌వ్య‌స్తంగా పారిశుధ్యం అనే శీర్షిక‌న క‌థ‌నం వెలువ‌డిన విష‌యం తెలిసిందే. అయితే బుధ‌వారం అధికారులు దిశ క‌థ‌నానికి స్పందించారు. మున్సిప‌ల్ చైర్మ‌న్ మొలుగు ప్ర‌శాంత్ కుమార్ జ‌మ్మికుంట ప‌ట్ట‌ణంలోని మారుతిన‌గ‌ర్ సోష‌ల్ వెల్పేర్ పాఠ‌శాల ముందు ఉన్న చెత్త‌ను సంద‌ర్శించారు. ఇక్క‌డ ఉన్న చెత్త‌ను క్లీన్ చేయాల‌ని మున్సిప‌ల్ సిబ్బందికి సూచించారు. రోడ్ల పై చెత్త‌ను ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ప‌డ‌వేయ‌కూడ‌ద‌ని.. చెత్త‌ను చెత్త బండిలోనే వేయాల‌ని చైర్మ‌న్ ప్ర‌శాంత్ కుమార్ తెలిపారు. చెత్త బండి వారు కూడా చెత్త‌కు కేటాయించిన యార్డ్ కి తీసుకెళ్లి ప‌డేయాల‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో శానిట‌రీ ఇన్ స్పెక్ట‌ర్, మున్సిప‌ల్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story