- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
"దిశ" కథనానికి స్పందన.. అధికారిక వెబ్‌సైట్‌లో మారిన అధికారుల పేర్లు
రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో మున్సిపల్ కమిషనర్ల పేర్ల గందరగోళంపై ఇవాళ 'దిశ' పత్రికలో ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో మున్సిపల్ కమిషనర్ల పేర్ల గందరగోళంపై ఇవాళ 'దిశ' పత్రికలో ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. టెక్నాలజీ యుగంలోనూ పాత పేర్లతో దర్శనమిస్తున్న పోర్టల్ పై బుధవారం "అధికారులు మారినా.. మారని పేర్లు" అనే శీర్షిక వెలువడిన కథనం అధికారుల్లో చలనం నింపింది. ప్రస్తుత కమిషనర్ మహమ్మద్ ఖాదీర్ పాషా విధుల్లో ఉన్నప్పటికీ, వెబ్‌సైట్‌లో పాత అధికారుల పేర్లు ఉండటాన్ని 'దిశ' ఎత్తి చూపడంతో ఈడియం విభాగం అప్రమత్తమైంది. కలెక్టర్ ఆదేశాల మేరకు వెబ్‌సైట్‌లోని తప్పులను సరిదిద్ది, తాజా వివరాలను అప్‌డేట్ చేశారు. గందరగోళానికి గురిచేసిన పాత పేర్లను తొలగించి, పారదర్శకమైన సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చారు. తమ సమస్యపై తక్షణమే స్పందించి, వార్త కథనాన్ని ప్రచురించి సమస్య పరిష్కారానికి కృషి చేసిన "దిశ" దినపత్రిక పనితీరు పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






