- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు..
by Taduka Kalyani |
చెరువులో సారవంతమైన మట్టిని అక్రమం గా తవ్వి తరలిస్తూ కొందరు జేబులు నింపుకుంటున్నారు.

X
దిశ, మల్యాల: చెరువులో సారవంతమైన మట్టిని అక్రమం గా తవ్వి తరలిస్తూ కొందరు జేబులు నింపుకుంటున్నారు. మల్యాల మండలం ముత్యంపేట (కొండగట్టు) తుమ్మ చెరువు ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. కొందరు అక్రమార్కుల కన్ను దీనిపై పడింది. ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి చెరువు ఆకృతిని దెబ్బ తీస్తున్నారు. ఆదివారం అదునుగా చేసుకుని అధికారుల కండ్లు కప్పి రాత్రి సమయంలో యథేచ్ఛగా చెరువు గర్భంలోని మట్టిని కొల్లగొడుతున్నారు. రాత్రి వేళలో మట్టి తవ్వకాలు జోరందుకున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్టర్లతో అనువైన ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖ నుంచి కానీ ఎటువంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా చెరువుల్లో మట్టిని తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
Next Story






