పేరు ఇందిరమ్మ.. ఎక్కడికో నువ్వు అడుగొద్దమ్మ.. అక్రమ మట్టి రవాణా తీరు ఇలా..?

by Bhanu |

అక్రమ మట్టి రమణ జరుగుతుందన్న విషయం అధికారులకు తెలిసినప్పటికిని మీనమేశాలతో జాప్యం చేస్తుండటంతో స్వయంగా ప్రజలే రంగంలోకి దిగిన వైనం.

పేరు ఇందిరమ్మ.. ఎక్కడికో నువ్వు అడుగొద్దమ్మ.. అక్రమ మట్టి రవాణా తీరు ఇలా..?
X

దిశ, రామడుగు: అక్రమ మట్టి రమణ జరుగుతుందన్న విషయం అధికారులకు తెలిసినప్పటికిని మీనమేశాలతో జాప్యం చేస్తుండటంతో స్వయంగా ప్రజలే రంగంలోకి దిగిన వైనం. వరాల్లోకి వెళితే రామడుగు మండలం దేశరాజు పల్లి గ్రామం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కోసం ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ఆ గ్రామాన్ని ఎంచుకుంది. ఈ క్రమంలో దేశరాజు పల్లి గ్రామంలో గత కొద్ది రోజుల నుండి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.. కాగా దేశరాజుపల్లి ఊర చెరువులో మొరం మట్టిని కొత్తపల్లి కి చెందిన ఓ వ్యక్తి జెసిబి ట్రాక్టర్ల సహాయంతో ఇందిరమ్మ ఇండ్లకు మొరం తరలిస్తున్నారు.. దీంతోపాటు ఇదే అదునుగా చేసుకొని పరిసర గ్రామాల ప్రజలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు.


అధికారుల నుండి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా మట్టి రవాణా తరలిస్తున్నారు.. ఈ విషయాన్ని పసిగట్టిన స్థానికులు పలుమార్లు మండల తాసిల్దార్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించిన కనీసం ఫలితం శూన్యం కావడంతో ప్రజలు వాపోయారు. నేటి శుక్రవారం చెరువులోని మట్టిని తరలిస్తున్న సమయంలో గ్రామస్తులు రెవెన్యూ అధికారికి సమాచారం అందించగా అక్కడికి ఓ అధికారి చేరుకోగా జెసిబి ట్రాక్టర్లు వెళ్లిపోవటం గమనార్హం.. తరలిపోతున్న జెసిబిలను ట్రాక్టర్లను పట్టుకోవాల్సిన అధికారి చూస్తూ నిమ్మకుండిపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారులు మాత్రం ఇంత తతంగం జరుగుతున్న మట్టి మాఫియా నుండి మామూలు తీసుకొని కనీసం పట్టించుకోవడం లేదని విమర్శలు ప్రజల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.




Next Story