- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రుతిమించుతున్న గ్రానైట్మాఫియా ఆగడాలు
క్వారీ కబ్జా వ్యవహారంలో మైనింగ్ శాఖ మంత్రి సంతకం ఫోర్జరీ చేయడం కీలకంగా నిలువగా నేటికి ఆ ఫోర్జరీపై చర్యలు లేకపోవడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

శ్రుతిమించుతున్న గ్రానైట్మాఫియా ఆగడాలు
అధికారులను ప్రభావితం చేసే నాయకుడు ఎవరు?
మంత్రి లేఖ ఫోర్జరి పై చర్యలేవి ?
అదికారుల మౌనానికి కారణం ఏంటి?
క్వారి అక్రమణతో అధికారపార్టీ పై తీవ్ర విమర్శలు
దిశ, కరీంనగర్ బ్యూరో : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ మాఫియా ఆగడాలు రోజు రోజుకూ శృతిమించుతున్నాయి. అయితే రాజకీయ పలుకుబడితో లాభదాయక గ్రానైట్ క్వారీలను స్వాధీనం చేసుకునేందుకు అధికార బలాన్ని ప్రయోగించడం సాక్షాత్తు మైనింగ్ వ్యవహారాల శాఖ మంత్రి సంతకాలనే ఫోర్జరీ చేస్తూ అధికారులను తప్పుదారి పట్టించడం వెనుక ఉన్నా నాయకుడు ఎవరు? అక్రమ దందాలకు ఆజ్యం పోస్తూ గత పాలకులు విధానాలను అవలంభిస్తున్న అజ్ఞాత నాయకుడు ఎవరు? అనేది రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది
వివాదస్పదంగా మారిన క్వారి కబ్జా వ్యవహరం
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం హన్మాజిపల్లి క్వారీ వివాదం ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్వారీ యజమానిని కొందరు వ్యక్తులు క్వారీ వదిలి వెళ్లాలంటూ హెచ్చరించడం, దౌర్జన్యంగా క్వారీలో చొరబడి బండరాళ్లను తరలించడం వివాదస్పదంగా మారింది. గ్రానైట్ బండరాళ్లను తరలిస్తుంటే మైనింగ్, రెవెన్యూ పోలీస్ అధికారులు పట్టించుకోకపోవడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెరవెనుక ఉండి అధికారులను కట్టడిచేస్తున్న ఆ అధికార పార్టీ నేత ఎవరు అనేది ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చానీయాంశంగా మారింది.
గత పాలకుల బాటలోనే అధికార పార్టీ నేతలు
గత పాలకులు భూ కబ్జాలు, అక్రమ దందాలు దౌర్జన్యాలతో ఆక్రమణలకు పాల్పడ్డారంటూ విమర్శించిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు వారు గత పాలకుల విధానాలనే అవలంభించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే కరీంనగర్ జిల్లా లో ప్రొటో కాల్ నామినేటేడ్ పోస్టు ను అనుభవిస్తున్న అధికార పార్టీ నాయకుడి కనుసన్నల్లో అక్రమ దందా సాగడం, అధికారులు సైతం బాధితుల ఫిర్యాదులను పక్కన పెట్టి అక్రమార్కులకు వంతపాడటం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతుండగా ఇప్పుడు అధికార పార్టీ నేత వ్యవహారాలపై అధిష్టానం కూపీ లాగుతున్నట్టు తెలుస్తుంది. పోస్టు కాస్తా ఊస్టవుతుంది అనే చర్చ అధికార పార్టీలో జోరందుకుంది
మంత్రి సంతకం ఫోర్జరి పై మౌనమేలా?
క్వారీ కబ్జా వ్యవహారంలో మైనింగ్ శాఖ మంత్రి సంతకం ఫోర్జరీ చేయడం కీలకంగా నిలువగా నేటికి ఆ ఫోర్జరీపై చర్యలు లేకపోవడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటివరకు మంత్రి సంతకం ఫోర్జరీ విషయం సదరు మంత్రి పేషికి చేరిందా? లేదా ? మంత్రి పేషికి చేరినప్పటికి అధికార పార్టీ నేతలే కదా అని ఊదాసీనంగా వ్యవహరించారా అనేది తెలియాల్సి ఉంది. అయితే బాధితుడు సదరు మంత్రిని కలసి తన గోడు వెల్లబోసుకున్నా అని చెప్పడం గమనార్హం. అయితే ఇప్పుడు సదరు నాయకుడు ఓ మంత్రికి సన్నిహితుడు కావడం చేత ఫ్రొటోకాల్ పదవిని కొట్టేసి సదరు మంత్రికి షాడో అనే స్థాయిలో బిల్డప్ ఇస్తూ అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని అక్రమ వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.






