మానేరు తీరాన క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సన్నాహాలు: ఆది శ్రీనివాస్

by Bhanu |

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో సిరిసిల్ల మానేరు తీరాన క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.

మానేరు తీరాన క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సన్నాహాలు:  ఆది శ్రీనివాస్
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో సిరిసిల్ల మానేరు తీరాన క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం సిరిసిల్ల మానేరు వాగు సమీపంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఆయన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మానేరు ఆవరణలోని స్థలాన్ని పరిశీలించారు. స్థలంలో క్రికెట్ పాడుతూ ప్రభుత్వ విప్ బ్యాటింగ్ చేయగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బౌలింగ్ చేశారు. జిల్లాలోని క్రికెట్ క్రీడాకారులు, విద్యార్థులకు అందుబాటులో ఉండేలా క్రికెట్ స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

రైతు బజార్, జిల్లా గ్రంథాలయం పరిశీలన

సిరిసిల్లలోని చిరు వ్యాపారులకు, రైతు బజారులో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని రైతు బజార్ ను ఆయన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నాగుల సత్యనారాయణ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప, ఆర్డీఓ వెంకటేశ్వర్లు పరిశీలించారు. రైతులు, కూరగాయల విక్రేతలకు కనీస వసతులు కల్పిస్తామని తెలిపారు. అనంతరం సిరిసిల్ల పట్టణంలోని గ్రంథాలయం ఆవరణలో మహాత్మా శ్రీ జ్యోతిరావుపూలే విగ్రహం ఏర్పాటుకు స్థలం పరిశీలించారు.

Next Story