- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోస్ట్ ఆఫీస్ కార్యాలయ ప్రాంగణం @ మందుబాబుల అడ్డా..!
శంకరపట్నం మండలంలొని కేశవపట్నం గ్రామంలో గల మందాకిని వైన్స్ యాజమాన్యం నిర్లక్ష్యంతో మందుబాబులు రెచ్చిపోతున్నారు.

దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలొని కేశవపట్నం గ్రామంలో గల మందాకిని వైన్స్ యాజమాన్యం నిర్లక్ష్యంతో మందుబాబులు రెచ్చిపోతున్నారు. మద్యం షాపు పక్కనే ఉన్న పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ముందు భాగంలో గల ప్రాంగణాన్ని మందుబాబులు సాయంత్రమైతే అడ్డాగా మార్చుకుంటున్నారు. యథేచ్ఛగా పోస్ట్ ఆఫీస్ ముందు కూర్చుని మద్యం సేవిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అంతేకాకుండా ఈ మద్యం షాపు వద్ద సాయంత్రం నాలుగు నుండి రాత్రి 8 గంటల వరకు విపరీతమైన రద్దీతో ఉంటుంది. దీనితో మందుబాబులు రహదారి అడ్డంగా వాహనదారులకు ఇబ్బంది కలిగేలా వారి వాహనాలను నిలుపుతున్నారని దీనితో రహదారి వెంబడి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
ఇష్టానుసారంగా వాహనాలను నిలపడం , గృహ సముదాయాల పక్కన మూత్ర విసర్జన చేయడం, మత్తు ఎక్కువై పడిపోయిన సందర్భాలు కోకొల్లలు అని సమీప గృహాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగిన మైకంలో మందుబాబులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఒకరిపై ఒకరి దాడి చేసుకున్న సందర్భాలు ఉన్నాయని ఇంత జరుగుతున్న స్థానిక పోలీసులు గాని ఎక్సైజ్ అధికారులు గాని పట్టించుకోకపోవడంతో మందుబాబుల ఆగడాలు యదేచ్చగా కొనసాగుతున్నాయి. పోలీసులు తగిన చర్యలు తీసుకొని మందు బాబుల ఆగడాలను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.






