ప్లీజ్..ఇక్కడ మాత్రం అస్సలు ఫుడ్ తినకండి

by Naveena |

గడువు తేదీ దాటిన ముడి పదార్థాలతో అపరిశుభ్ర వంటశాలలో కేకులు , స్వీట్లు తయారు చేస్తున్నా ఘటన తీవ్ర కలకలం రేపుతుంది.

ప్లీజ్..ఇక్కడ మాత్రం అస్సలు ఫుడ్ తినకండి
X

దిశ, గోదావరిఖని: గడువు తేదీ దాటిన ముడి పదార్థాలతో అపరిశుభ్ర వంటశాలలో కేకులు , స్వీట్లు తయారు చేస్తున్నా ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచులలో విక్రయిస్తున్న గోదావరిఖని లక్ష్మీ నగర్ లోని సిరి కేక్స్, మోర్ దుకాణ నిర్వాహకుడికి రామగుండం నగర పాలక సంస్థ ఇరవై వేల రూపాయల జరిమానా విధించింది. అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ ( ఎఫ్ ఎ సి ) అరుణ శ్రీ ఆదేశాల మేరకు బుధవారం నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగం హెల్త్ అసిస్టెంట్ కిరణ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా ఏనాడో కాలం చెల్లిన రసాయనాలు , ఇతర పదార్థాలతో కేకులు , స్వీట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు దుకాణ యజమానులకు జరిమానా విధించారు. చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని, ఇకముందు ఇలానే నాణ్యతలేనివి తయారు చేయకూడదని యజమానులను హెచ్చరించారు. ఈ తనిఖీలలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్ , ఎం ఐ ఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Next Story