క్రీడలతో శారీరక, మానసికోల్లాసం : ఎంపీడీవో శ్ర‌వ‌ణ్ కుమార్

by Ratna Kumari |

క్రీడలతో విద్యార్థులకు శారీరక, మానసికోల్లాసం కలుగుతుందని ఇన్ చార్జి ఎంపీడీవో శ్రవణ్ కుమార్ అన్నారు. సీఎం కప్ వెదిర క్లస్టర్ లెవల్ క్రీడాపోటీలను వెదిర స్కూల్ లో మంగళవారం నిర్వహించారు.

క్రీడలతో శారీరక, మానసికోల్లాసం : ఎంపీడీవో శ్ర‌వ‌ణ్ కుమార్
X

దిశ‌, రామ‌డుగు : క్రీడలతో విద్యార్థులకు శారీరక, మానసికోల్లాసం కలుగుతుందని ఇన్ చార్జి ఎంపీడీవో శ్రవణ్ కుమార్ అన్నారు. సీఎం కప్ వెదిర క్లస్టర్ లెవల్ క్రీడాపోటీలను వెదిర స్కూల్ లో మంగళవారం నిర్వహించారు. ఈ పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడాపోటీల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలన్నారు. ఓటమి గెలుపునకు నాంది అని, గెలిచినప్పుడు పొంగిపోకుండా, ఓడినప్పుడు కుంగిపోకుండా నిలకడగా ఉండాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు ఖోఖో, కబడ్డీ, రన్నింగ్, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. క్లస్టర్ లెవల్లో ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను మండలస్థాయికి, మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపిన వారిని జిల్లా స్థాయికి ఎంపికచేస్తామని ఎస్జీఎఫ్ మండల సెక్రటరీ దత్తాత్రేయ శర్మ తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో రంగనాథశర్మ, వెదిర హైస్కూల్ హెచ్ఎం కె.రాజమల్లయ్య, పీడీ ఇజాజ్, పీఈటీ సాయికృష్ణ పాల్గొన్నారు.

Next Story