- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫార్మసిస్ట్ రౌడీ ఇజం.. తోటి ఉద్యోగిపై దాడి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మసిస్ట్ తోటీ ఉద్యోగి పై దాడి చేసిన సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటుచేసుకుంది.

దిశ, సైదాపూర్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మసిస్ట్ తోటీ ఉద్యోగి పై దాడి చేసిన సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు ఆస్పత్రి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం...ప్రతి మంగళవారం ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీంతో పాటు ఈ వారం ఆశా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఫార్మాసిస్టు 11:40 కి ఆసుపత్రికి వచ్చి విధుల్లో ఉన్న ఎన్సీపీ నర్సింగ్ అధికారి రాజేందర్ అనే ఉద్యోగిని బూతులు తిడుతూ దాడి చేశాడని ఆస్పత్రికి వచ్చిన రోగులు తెలిపారు. ఫార్మసిస్ట్ కళ్యాణ్ సురేష్ దాడి చేసిన విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో, డిప్యూటీ డిఎంహెచ్వో కార్యాలయం హుజురాబాద్ లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.
వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది బూతులు తిట్టుకోవడం కొట్టుకోవడం చూసి అక్కడున్న రోగులు నివ్వరపోయారు. ప్రతిరోజు విధులకు ఆలస్యంగా వచ్చే ఫార్మాసిస్టు పై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఇట్టి విషయంపై వైద్యాధికారి కృష్ణారావును వివరణ కోరగా గొడవ జరిగిన మాట వాస్తవమేనని గొడవ జరిగిన సమయంలో వైద్యాధికారి ఆస్పత్రి ఆవరణంలో జరిగే ఆశా డే కార్యక్రమంలో ఉన్నానని, తరువాత సిబ్బందితో వచ్చి తనకు ఫిర్యాదు చేసి బుధవారం విధులకు హాజరుకామని తెలిపారన్నారు. కాగా వైద్యాధికారి రేపు విచారణ చేసి చర్యలు తీసుకునేందుకు జిల్లా అధికారులకు రిపోర్ట్ పంపిస్తానని తెలిపారు.






