- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్ఈసీ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి : ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్
దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్.ఈ.సీ) నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్.ఈ.సీ) నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు(ఆర్.ఓ) లకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు వివిధ అంశాలపై సోమవారం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి కుమార్ తో కలిసి ఆమె శిక్షణ ఇచ్చారు. పీపీటీ ప్రదర్శన ఇచ్చి ప్రతి అంశంపై వివరించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ప్రతి ఆర్ ఓ తమ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని, విద్యుత్ సరఫరా, నీటి వసతి తదితర సదుపాయాలు తనిఖీ చేయాలని, సంబంధిత ఎంపీడీఓలు, అధికారులతో సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇతర సామగ్రి సరిచూసుకోనేలా పీఓ లు, ఇతర పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన వాహనాల్లోనే ఎన్నికల సామగ్రి తరలించాలని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆర్ ఓలకు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. శిక్షణలో డీఆర్డీఓ శేషాద్రి, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీపీఓ షరీఫుద్దిన్, నోడల్ అధికారి భారతి, ట్రైనర్లు పాల్గొన్నారు.
స్వచ్ఛ హరిత విద్యాలయాలకు ప్రశంసా పత్రాలు
జిల్లాలోని స్వచ్ఛ హరిత విద్యాలయాలకు ఎంపికైన హెచ్ఎంలు, బాధ్యులకు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రశంసా పత్రాలు సోమవారం అందజేశారు. స్వచ్ఛ హరిత విద్యాలయాల కోసం నిర్వహించిన సర్వేలో జిల్లాలోని 650 పాఠశాలలు పాల్గొనగా, 8 పాఠశాలలు ఎంపిక అయ్యాయి. మొదటి కేటగిరిలో ఎంపీపీఎస్ నేరేళ్ల, యూపీఎస్ శ్రీవాణి పోతుగల్, ఎంపీపీఎస్ మర్రిగడ్డ, ఎంపీపీఎస్ సిరిసిల్ల నెహ్రూ నగర్, రెండవ కేటగిరిలో (9 నుంచి 12వ తరగతి వరకు) జడ్పీ హై స్కూల్ జిల్లెల్ల, జడ్పీ హై స్కూల్ వెల్జిపూర్, కేజీబీవీ ముస్తాబాద్, వివేకానంద హైస్కూల్ వేములవాడ ఎంపిక అయ్యాయి. ఆయా విద్యా సంస్థల హెచ్ఎంలు, బాధ్యులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం కార్యక్రమాన్ని నిర్వహించి, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రశంసా పత్రాలు అందజేసి, వారిని అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్, అధికారి సతీష్. తదితరులు పాల్గొన్నారు.






