మతతత్వాన్ని కర్ణాటక ప్రజలు తిరస్కరించారు: శ్రీధర్ బాబు

by Disha Web Desk 12 |
మతతత్వాన్ని కర్ణాటక ప్రజలు తిరస్కరించారు: శ్రీధర్ బాబు
X

దిశ, మంథని: మతతత్వాన్ని కర్ణాటక ప్రజలు తిరస్కరించారని ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో కీలక భూమిక పోషించిన శ్రీధర్ బాబు సోమవారం రాత్రి తన సొంత నియోజకవర్గం మంథనికి వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. మంథని అంబేద్కర్ కూడలిలో ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక ప్రజలు కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, వాగ్దానాలను నమ్మి పట్టం కట్టారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం అభివృద్ధిని కోరుకుంటుదన్నారు. కర్ణాటక స్ఫూర్తితో రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని అన్నారు. అక్కడ నేతలంతా విభేదాలను పక్కనపెట్టి ఒక తాటిపైకి వచ్చారని పేర్కొన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేందుకు కార్యాచరణ మొదలు పెట్టిందన్నారు. కొందరు తనను రాజకీయంగా ఎదుర్కోలేక విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రౌడీయిజం, గుండాయిజానికి తావు లేదని కర్ణాటకలోని ఓ ప్రాంతంలో ప్రజలు నిరూపించారని తెలిపారు. అభివృద్ధి సంక్షేమం తప్ప ప్రజలు అశాంతిని కోరుకోరని అన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాశ్ రెడ్డి, నాయకులు మక్కాన్సింగ్, తిరుపతి యాదవ్, సదానందం, సెగ్గెంరాజేష్, శశిభూషణ్, అజీమ్ ఖాన్, వొడ్నాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed