- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీ బస్టాండ్‌లో నీటి సౌకర్యం లేక ప్రయాణికుల ఇబ్బందులు
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు మూత్రశాలల సౌకర్యం లేక ప్రజలు నానా ఇబ్బందులకు గురి అవుతున్న పట్టించుకునే నాథులే లేరు.

దిశ, ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు మూత్రశాలల సౌకర్యం లేక ప్రజలు నానా ఇబ్బందులకు గురి అవుతున్న పట్టించుకునే నాథులే లేరు. టిజిఆర్‌టిసి ప్రయాణ ప్రాంగణంలో ప్రయాణికుల కోసం ఏర్పాటుచేసిన మూత్రశాలలు మరుగుదొడ్లు నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రయాణ ప్రాంగణంలో నీటి సౌకర్యం కల్పించడం కోసం అప్పటి ఆర్టీసీ అధికారులు బోరు వేయించారు. బోరుకు పంపుసెట్టు బిగించారు.
ప్రస్తుతం ఆ బోరుకు పంపుసెట్టు లేదు. పంపుసెట్టు ఎక్కడ ఉందో ఇప్పటికీ తెలియని పరిస్థితి ఉంది. దీంతో ప్రయాణ ప్రాంగణంలో నీటి సౌకర్యం లేక రెండు అద్దె షటర్ దుకాణాలు మరుగుదొడ్లు మూత్రశాలలు నిరుపయోగంగా ఉన్నాయి. దుమాల గ్రామానికి చెందిన దినసరి స్వీపర్ నర్సమ్మ తాత్కాలిక వేతనంపై ప్రతిరోజు ప్రయాణ ప్రాంగణాన్ని శుభ్రపరుస్తుంది. ఆమె నీటి సౌకర్యం లేక మూత్రశాలలకు మరుగుదొడ్లకు తాళాలు వేసేసింది. ప్రయాణ ప్రాంగణంలో మూత్రశాలల మరుగుదొడ్ల పరిస్థితి ఇలా ఉందంటే కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు వివిధ దుకాణ దారులు ఈ ప్రాంత ప్రజలు మూత్రశాలలు లేక ఇబ్బంది పడుతున్నారు.
పలుమార్లు స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకు పోయిన అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి దృష్టికి స్పెషల్ ఆఫీసర్, మండల తహసీల్దార్ సుజాత ఎంపీడీవో సత్తయ్యల ఆర్టీసీ ఆర్ఎం డిఎంల దృష్టికి తీసుకుపోయిన మూత్రశాలల సమస్య ఇప్పటి వరకు పరిష్కారానికి నోచుకోలేదు. మనిషికి మరుగుదొడ్ల , మూత్రశాలల సమస్య ఎటువంటిదో అర్థం చేసుకొని ఇప్పటికైనా పాత బస్టాండ్ లో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రక్కన గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్మించిన దుకాణాల సముదాయం పక్కన వెంటనే గ్రామ పంచాయతీ పాలకవర్గం శ్రద్ధ తీసుకొని మూత్రశాలల మరుగుదొడ్ల నిర్మాణం పనులను చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా ప్రయాణ ప్రాంగణంలో బోరుకు పంపుసెట్టు బిగించి నీటి సౌకర్యం కల్పించి అక్కడ కూడా మరుగుదొడ్ల మూత్రశాలల సమస్యలను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.






