- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎవరి వ్యూహం వారిదే.. భవితవ్యంపై పార్టీలకు కునుకే కరువు
మున్సిపల్ వీధుల్లో రాజకీయ జాతరలు. ఆశల గుర్రాలు పందెంలో పరిగెడుతున్నాయి. గెలుపు జెండా కోసం వివివిధ పార్టీలు తహతహలాడుతున్నాయి.

దిశ, సుల్తానాబాద్: మున్సిపల్ వీధుల్లో రాజకీయ జాతరలు. ఆశల గుర్రాలు పందెంలో పరిగెడుతున్నాయి. గెలుపు జెండా కోసం వివివిధ పార్టీలు తహతహలాడుతున్నాయి. మురిపించేవారెవరినో ముంచేదెవరినో..? ఓటరే దేవుడు..ఇక వారి తీర్పే శిరోధార్యం, మారనున్న రాజకీయ భవితవ్యం రాజకీయ చదరంగంలో గెలుపెవరిదో, మలుపెవరిదో అధికార పీఠం ఒకటే ఆశావహులు ఎందరో పలు మున్సిపాలిటీలో ముదిరిన పోరు.ఎవరి పట్టు వారిదే.
ప్రజా క్షేత్రంలో తేలనుంది అసలు సిసలు దమ్ము ఓటరు వేయనున్నాడు గెలుపు ముద్ర. మున్సిపాలిటీ యుద్ధంలో వార్డులే లక్ష్యం,గెలుపు గుర్రాలపైనే నేతల గురి. పార్టీల మధ్య ప్రతిష్టాత్మక పోరు. తెలంగాణ గడ్డపై మొదలైంది అసలు సిసలు హోరు. వార్డు వార్డులో వ్యూహాల వేడి,మున్సిపల్ పీఠంపై ఎవరిది జోడి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వాడి వేడి కనిపిస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా రాజకీయ ప్రకంపనలే కనిపిస్తున్నాయి. పలు పార్టీల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో అత్యంత ఆసక్తికరంగా మారింది. వ్యూహ ప్రతివ్యూహాల నడుమ తెలంగాణ రాష్ట్ర రాజకీయ క్షేత్రంలో ప్రస్తుతం ఇద్దరు నేతలు గెలుపు గుర్రాలై నిలుస్తున్నారు. ఒకరు ప్రజాబలంతో అసెంబ్లీలో అడుగుపెట్టిన ప్రస్తుత శాసనసభ్యులు ఇంకొకరు అదృష్టం కలిసిరాక ఓడిన మాజీలు, తమ నియోజకవర్గంపై తనదైన ముద్ర వేయాలని చూస్తున్న తాజా మాజీల ఆశయం ఒక్కటే.. పీఠంపై తమ జెండాలు ఎగురవేయడం. కానీ, ఆ గెలుపు బాట అంత సులభంగా కనిపించడం లేదు. మున్సిపాలిటీ ఓటరే ‘డిసైడింగ్ ఫ్యాక్టర్’ నియోజకవర్గ గెలుపోటములను శాసించేది ప్రధానంగా రాష్ట్రం లోని మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లే. ఇక్కడి ఓటరు దేవుళ్లు ఎటు మొగ్గు చూపుతారన్నదే ఇప్పుడు అందరిలోనూ నెలకొన్న ఉత్కంఠ. ప్రస్తుత ఎమ్మెల్యేలు తన అభివృద్ధి పనులతో ఓటర్లను మెప్పిస్తామనే ధీమాతో ఉన్నారు. మరోవైపు, మాజీ ఎమ్మెల్యేలు కేడర్‌ను బలోపేతం చేస్తూ తిరిగి పుంజుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
మురిపిస్తారా, ‘ముంచేస్తారా ఓటరు చేతులో పని
రాజకీయ స్టంట్లు, ఆరోపణలు, విమర్శల పర్వం ఎలా ఉన్నా.. అంతిమ నిర్ణయం ఓటరు దేవుళ్లదే. మున్సిపాలిటీలోని ప్రజలు ఒకరికి జై కొట్టి మురిపిస్తారా.? లేదా తమ ఓటు అనే ఆయుధంతో మరొకరి ఆశలను ఆవిరి చేస్తారా.? అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం రాష్ట్ర రాజకీయం జైలు గోడ మీద పిల్లిలా ఉందనే చెప్పాలి.
ఎవరు గెలిచినా, ఓడినా ఈ ఓట్ల యుద్ధం మాత్రం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేక చర్చకు దారితీస్తోంది.ఏక్ దిన్ కా సుల్తాన్ ఓటరు మనసెటో మరీ.వివిధ వార్డులలో ఉన్న పెద్ద మనుషులను డబ్బులకు మద్యానికి ప్రలోభ పెడుతూ వారికి రేటు కడుతు అధికార పార్టీ అభ్యర్థులు కొంటున్నారు. ఆపోజిట్ పార్టీ అభ్యర్థులను డబ్బులకు లోపర్చుకొని వారు ప్రచారంలో చేయకుండాకుండా వారిని కట్టడి చేస్తూ అన్ని రకాల హంగులతో వారిపైన ఒత్తిడి తెస్తున్నారు.






