- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అకాల వర్షం.. అపార నష్టం..!
అకాల వడగళ్ల వర్షం కురవడంతో రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

దిశ, కోనరావుపేట : అకాల వడగళ్ల వర్షం కురవడంతో రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో నష్టపోయిన రైతుల పంట పొలాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలంలోని బావుసాయిపేట, వెంకట్రావుపేట, కొండాపూర్, వట్టిమల్ల, నిమ్మపల్లి తదితర గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వర్షంతో కోతకు వచ్చిన వరిపంట దాదాపు 50% వరకు నేలరాలడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన దండు వినోద్ రైతన్నలను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అకాల వర్షం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఎకరానికి సుమారు 50% వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 20,000 పరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనకు తమ వంతు 49% వాటాను చెల్లించకుండా రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం బీమా చెల్లిస్తే సుమారు రూ. 1,500 కోట్లు ఖర్చవుతాయని భావించి, అప్పుడప్పుడు జరిగే పంట నష్టాలకు తక్కువ మొత్తంలో పరిహారం అందిస్తూ చేతులు దులుపుకుంటోందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు బర్కాం రమేష్, పరశురాములు, స్వామి తదితరులు పాల్గొన్నారు.






