అదుపు తప్పిన ద్విచక్ర వాహనం, ఒకరికి తీవ్ర గాయాలు

by velandi.Saikiran |

మండలంలోని ఎరడపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి భూమయ్య (47) తన పొలం వద్ద ఇంటికి వస్తున్న క్రమంలో అత‌ని ద్విచక్ర వాహనం

అదుపు తప్పిన ద్విచక్ర వాహనం, ఒకరికి తీవ్ర గాయాలు
X

దిశ, శంకరపట్నం: మండలంలోని ఎరడపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి భూమయ్య (47) తన పొలం వద్ద ఇంటికి వస్తున్న క్రమంలో అత‌ని ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. ఈ త‌రుణంలోనే గంగిపల్లి-ఎరడపల్లి గ్రామాల మధ్యలో వరి ధాన్యం కుప్పపైకి బైక్ దూసుకెళ్లింది. ఈ సంఘ‌ట‌న‌లో భూమయ్య ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడగా, అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానిక రైతులు 108 కు సమాచారం అందించారు. అనంత‌రం భూమ‌య్య‌ను కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.

Next Story