- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంరక్షణకు కాదు సరఫరాకు..!
ఆపదలో ఉన్న పిల్లల సంరక్షణ కోరకు అత్యవసర సమాచారం అందుకుని రక్షించేందుకు ఏర్పాటు చేసిన వాహనాన్ని ప్రసాదాల పంపిణికి వాడటం జగిత్యాల జిల్లాలో వివాదస్పదంగా మారింది.

దిశ, కరీంనగర్ బ్యూరో : ఆపదలో ఉన్న పిల్లల సంరక్షణ కోరకు అత్యవసర సమాచారం అందుకుని రక్షించేందుకు ఏర్పాటు చేసిన వాహనాన్ని ప్రసాదాల పంపిణికి వాడటం జగిత్యాల జిల్లాలో వివాదస్పదంగా మారింది. అత్యవసర సేవలకు ఉపయోగించాల్సిన 1098 వాహనంలో ప్రసాదాల రవాణాకు వాడుతున్న ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో అదికారుల తీరు పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పిల్లలకు అత్యవసర సహాయ సేవల కోసం పని చేసే బాల రక్షక్ 1098 వాహనాన్ని అధికారులు, సిబ్బంది ఎలా వినియోగిస్తున్నారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. జగిత్యాల పట్టణంలో బాలల రక్షణ కోసం ఏర్పాటు చేసిన 1098 వాహనంలో లక్ష్మి నరసింహా స్వామి దేవస్థానానికి చెందిన ప్రసాదాలను తపాలా కార్యాలయానికి తరలిస్తున్న ఘటన దిశ కెమెరాకు చిక్కింది పిల్లల అత్యవసర సేవలకు అందుబాటులో ఉండాల్సిన వాహనాన్ని ఇలా ఇతర పనులకు ఉపయోగించడం పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ప్రమాదంలో ఉన్నప్పుడు సహాయం చేయాల్సిన వాహనం ఇలా ఇతర పనులకు వినియోగిస్తే అత్యవసర సమయంలో సేవలు ఎలా అందిస్తారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.






