- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'డంపింగ్ యార్డ్ వద్దు - ప్రజారోగ్యమే ముద్దు'
హుజూరాబాద్ పట్టణ పరిసర ప్రాంతంలోని సిర్సపల్లి గ్రామ సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేయ తలపెట్టిన డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవుతోంది.

దిశ, హుజూరాబాద్ రూరల్ : హుజూరాబాద్ పట్టణ పరిసర ప్రాంతంలోని సిర్సపల్లి గ్రామ సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేయ తలపెట్టిన డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవుతోంది. ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, పట్టణానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ చేపట్టిన వినూత్న నిరసన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సైకిల్ యాత్రతో జన జాగృతి
గత 12 రోజులుగా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు కొనసాగుతుండగా.. వేణుగోపాల్ తన వంతుగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సైకిల్‌ను ఆయుధంగా చేసుకున్నారు. తన సైకిల్ కి "డంపింగ్ యార్డ్ వద్దు - ప్రజారోగ్యమే ముద్దు" అనే నినాదంతో కూడిన ఫ్లెక్సీని కట్టుకుని, పట్టణంలోని ప్రధాన వీధుల గుండా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. "రాబోయే తరాల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి నివాస ప్రాంతాల సమీపంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం సరికాదు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకునే వరకు నా పోరాటం ఆపను" అని సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ అన్నారు.
12వ రోజుకు చేరిన దీక్షలు
అఖిలపక్షం నేతృత్వంలో వివిధ వర్గాల ప్రజలు, నాయకులు ఈ నిరసనలో చురుకుగా పాల్గొంటున్నారు. దీక్షా శిబిరాల వద్దనే కాకుండా, సామాన్యులకు ఈ సమస్య తీవ్రతను వివరించేందుకు వేణుగోపాల్ పట్టణమంతా పర్యటిస్తున్నారు. ప్రజారోగ్యంపై వేణుగోపాల్ చూపుతున్న అంకితభావాన్ని, ఆయన చేపట్టిన వినూత్న నిరసనను పట్టణ ప్రజలు,వివిధ సంఘాల నాయకులు అభినందిస్తున్నారు. డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాటం ఈ వినూత్న ప్రచారంతో మరింత ప్రజాదరణ పొందుతోంది. ప్రభుత్వం స్పందించి ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని స్థానికులు కోరుతున్నారు.






