- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మామయ్య ఆసుపత్రికి వెళ్లాడు.. కొడలు మృతి.. ఇంతకీ ఏమైందంటే..?
by Naveena |
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్ట కాలనిలో చోటు చేసుకుంది.

X
దిశ,కోరుట్ల టౌన్ : ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్ట కాలనిలో చోటు చేసుకుంది. కోరుట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఏస్కోని గుట్ట కాలనికి చెందిన రజిత (23),కు అల్లమయ్య గుట్ట కాలానికి చెందిన పవన్ తో ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం జరిగింది. మంగళవారం పవన్ తండ్రికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో.. కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రి తీసుకెళ్లగా ఇంట్లో ఎవరు లేని సమయంలో రజిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. రజిత ఆత్మహత్యకు మనస్పర్థలే కారణమని తెలిసింది. ఇదిలా ఉండగా అత్తింటి వారి వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి పోలీసులు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






