ట్రాక్టర్ ప్రమాదంలో వ్యక్తి మృతి

by Bhanu |   (  Updated:2025-05-11 15:04:39  IST  )

వేసవి సెలవులలో సరదాగా తన సమీప బంధువుతో కలిసి గ్రామంలోని దాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందిన సంఘటన ముత్తారం మండలం మైదంబండ గ్రామంలో చోటుచేసుకుంది.

ట్రాక్టర్ ప్రమాదంలో వ్యక్తి మృతి
X

దిశ, ముత్తారం: వేసవి సెలవులలో సరదాగా తన సమీప బంధువుతో కలిసి గ్రామంలోని దాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందిన సంఘటన ముత్తారం మండలం మైదంబండ గ్రామంలో చోటుచేసుకుంది. ముత్తారం ఎస్ఐ గోపతి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం మైదంబండ గ్రామానికి చెందిన పందుల మొగిలికి ఇద్దరు కుమారులు శ్రావణ్ మల్లేష్ ఒక కూతురు ఉన్నారు కూతురు కు వివాహం అయింది చిన్న కుమారుడు మల్లేష్ పదవ తరగతి చదువుతున్నాడు వేసవి సెలవుల్లో సరదాగా తన సమీప బంధువు పందుల శేఖర్ తో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లాడు దాన్యం కొనుగోలు కేంద్రంలో నిమ్మల కుమార్ కు చెందిన ట్రాక్టర్లో వరి ధాన్యం బస్తాలను లోడ్ చేస్తుండగా ట్రాక్టర్ కదలడంతో అక్కడే ఉన్న మల్లేష్ ట్రాక్టర్ ను ఆపే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ మల్లేష్ పై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడి తండ్రి మొగిలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపతి నరేష్ తెలిపారు.


Next Story