ఐకేపీ సెంటర్ల వడ్ల కొనుగోలుపై ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి

by Ratna Kumari |

ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్లలో నిల్వ ఉన్న వడ్లను వేగవంతంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ పక్షాన ముస్తాబాద్ ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టారు.

ఐకేపీ సెంటర్ల వడ్ల కొనుగోలుపై ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి
X

దిశ, ముస్తాబాద్ : ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్లలో నిల్వ ఉన్న వడ్లను వేగవంతంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ పక్షాన ముస్తాబాద్ ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఆందోళన ఉధృతంగా మారే పరిస్థితి నెలకొనగా పోలీసులు అక్కడికి చేరుకొని నాయకులను కార్యకర్తలను శాంతింప చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో వడ్లు రోజుల తరబడి పేరుకుపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు.


నిన్న కురిసిన వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి రైతులు మరింత ఆందోళనకు గురయ్యారని తెలిపారు. ధాన్యాన్ని కాపాడుకునే పరిస్థితి లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తడిసిన ధాన్యం నష్టపోయే ప్రమాదం ఉన్నప్పటికీ అధికారులు వెంటనే స్పందించడం లేదని విమర్శించారు. రైతుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, తడిసిన ధాన్యాన్ని రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Next Story