విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

by Disha Web Desk 13 |
విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న వైఖరితో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారిందని.. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు. విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని.. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించినప్పటికీ అందుకు తగినట్టుగా అధ్యాపకులను నియమించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. టెట్ ఫలితాలు వెల్లడై ఆరు నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు నియామక ప్రక్రియ ఎందుకు మొదలు పెట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

'మన ఊరు-మనబడి' పథకం కింద పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన ను స్వాగతిస్తున్నామని అయితే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ల నిధులను ఆ పథకానికి కార్యక్రమానికి మళ్ళించారని ఆరోపించారు. ఇప్పటివరకు కనీసం 10 శాతం పనులైన పూర్తి చేయలేదని విమర్శించారు. పనుల్లో జాబ్యానికి అధికారులు పూర్తి బాధ్యత వహించాలన్నారు. 8 ఏళ్లుగా కేజీ టు పీజీ విద్య సామాన్యులకు అందుబాటులోకి రాలేదని రాష్ట్రంలో కేజీ టు పీజీ విద్య ఒక చోట ప్రారంభించి రాష్ట్రమంతటా ప్రారంభించినట్టుగా ప్రభుత్వం గొప్పలకు పోతుందని ఎద్దేవా చేశారు.

పాఠశాలల్లో స్వీపర్లు స్కావెంజర్ల ను తొలగించారని వారు లేకుండా పాఠశాలల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటనలకు వెచ్చిస్తున్న మొత్తాన్ని పాఠశాలల నిర్వహణకు వాడాలని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి బండ శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లపల్లి దుర్గయ్య, మైనార్టీ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మన్సూర్,మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్,పుప్పాల అశోక్, రాధా కిషన్, మారు గంగా రెడ్డి, మహిపాల్, విజయ్, రాజిరెడ్డి, ధర్మపురి నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed