- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిరిసిల్లలో మంత్రి సీతక్క పర్యటన..స్థానిక ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేసారు. సోమవారం సిరిసిల్ల జిల్లా పర్యటనకు

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేసారు. సోమవారం సిరిసిల్ల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క ఇందిరా మహిళ శక్తి పథకంలో భాగంగా తయారవుతున్న చీరలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. స్థానిక చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చీరలను నేసే విధానాన్ని పరిశీలించారు. చేనేత కార్మికుల ఇబ్బందులను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మీడియాతో సీతక్క మాట్లాడుతూ పలు కీలక అంశాలను వెల్లడించారు. సామాజిక న్యాయం అందించాలని ఉద్దేశంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే, కొంతమంది సుప్రీంకోర్టుకు మరి కొంతమంది హైకోర్టుకు వెళ్ళారని తెలిపారు. ఈ విషయంపై దాఖలైన పిటీషన్ ను ఇప్పటికే సుప్రీంకోర్టు కొట్టివేసిందని, ఈనెల 8న హైకోర్టు సైతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లను కొట్టివేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ముందుగా ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికల నిర్వహిస్తామని అన్నారు.






