స్వ‌చ్ఛ‌ హరిత విద్యా రేటింగ్ సాధించిన మర్రిగడ్డ పాఠశాల

by Nallavelli.Anjaneyulu |

దిశ, చందుర్తి : చందుర్తి మండలం లోని మర్రిగడ్డ ప్రాథమిక పాఠశాలలో పరిశుభ్రత విద్యార్థులకు కావాల్సిన మౌళిక వసతుల కల్పనలో జిల్లా స్థాయి ఉత్తమ ఫలితాలు సాధించినందుకు ప్రధానోపాధ్యాయులు

స్వ‌చ్ఛ‌ హరిత విద్యా రేటింగ్ సాధించిన మర్రిగడ్డ పాఠశాల
X

దిశ, చందుర్తి : చందుర్తి మండలం లోని మర్రిగడ్డ ప్రాథమిక పాఠశాలలో పరిశుభ్రత విద్యార్థులకు కావాల్సిన మౌళిక వసతుల కల్పనలో జిల్లా స్థాయి ఉత్తమ ఫలితాలు సాధించినందుకు ప్రధానోపాధ్యాయులు గడప రఘుపతిరావు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. SHVR 2025 జాతీయ స్థాయిలో 2025-26 సంవత్సరమునకు "స్వచ్ఛ హరిత విద్యాలయ" రేటింగ్ కార్యక్రమంలో మన జిల్లా నుండి 650 పాఠశాలలు పాల్గొనడం జరిగింది. ఇందులో నుండి అత్యధిక స్కోర్ పొందినటువంటి ప్రాథమిక పాఠశాలలు నాలుగు ఉన్నత పాఠశాలలు నాలుగింటిని కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా కమిటీ ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపడం జరిగింది. కేటగిరి 1 (1 నుండి 8వ తరగతి వరకు) నుండి "5 స్టార్ రేటింగ్" పొంది "ప్రాథమిక పాఠశాల మర్రిగడ్డ"(చందుర్తి మండలం) రాష్ట్ర స్థాయికి ఎన్నికైనది.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గడప రఘుపతిరావు కు కలెక్టర్ ప్రశంసా పత్రం అందించారు. జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో కూడా ఎన్నికై జాతీయ స్థాయికి వెళ్ళేలా చూడాలని అన్నారు. చందుర్తి మండలం నుండి రాష్ట్రస్థాయిలో ఎంపికైనందుకు మండల విద్యాధికారి, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Next Story