- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివాహిత ఆత్మహత్య
by Kema Shiva Kumar |
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని అయిలాపూర్ లో శనివారం చోటుచేసుకుంది.

X
దిశ, కోరుట్ల రూరల్: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని అయిలాపూర్ లో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాలకు చెందిన మమత (25) అయిలాపూర్ గ్రామానికి చెందిన కుందేళ్ల రాకేష్ (28) ఏడు నెలల క్రితం ఇరువురు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నారు. వృత్తి రీత్యా రాకేష్ కారు డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శనివారం రాకేష్ డ్యూటీలో భాగంగా హైదరాబాద్ కు వెళ్లాడు. ఈ క్రమంలో సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మమత ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.మృతికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై సతీష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- Marital suicide
Next Story






