- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోచంపల్లిలో విషాదం: అనారోగ్యంతో బాధపడుతూ వృద్ధుడి ఆత్మహత్య...
కరీంనగర్ జిల్లా, మానకొండూరు మండలం పరిధిలోని పోచంపల్లి గ్రామంలో శుక్రవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది.

దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా, మానకొండూరు మండలం పరిధిలోని పోచంపల్లి గ్రామంలో శుక్రవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పొలం పోచాలు (76) అనే వృద్ధుడు తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, పోచాలు గత 15 సంవత్సరాలుగా పిడ్స్ వ్యాధితో బాధపడుతున్నారు. కొంతకాలంగా కడుపు నొప్పి కూడా ఆయనను తీవ్రంగా వేధిస్తోంది. ఈ అనారోగ్య సమస్యలతో మానసికంగా కుంగిపోయిన పోచాలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్రూమ్ గోడకు తన పంచెతో ఉరి వేసుకొని మృతి చెందారు.
శుక్రవారం ఉదయం ఇంటి వద్ద జరిగిన ఈ విషాదకర ఘటనను తొలుత గ్రామస్తుడైన కాలువ శ్రీనివాస్ గుర్తించారు. వెంటనే ఆయన కరీంనగర్‌లో ఉంటున్న మృతుడి కుమారులకు సమాచారం అందించారు. తండ్రి మరణ వార్త విన్న కుమారులు హుటాహుటిన గ్రామానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు పొలం రవి మానకొండూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు మానకొండూరు సీఐ సంజీవ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధుడు అనారోగ్య సమస్యల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
భార్యతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న పోచాలుకు ఇద్దరు కుమారులు, ఒక్క కూతురు అత్త వారి ఇంట్లో ఉన్నారు.కొడుకులు కరీంనగర్‌లో స్థిరపడ్డారు. వృద్ధుడి మృతితో పోచంపల్లి గ్రామంలో శోకసంద్రం నెలకొంది.






