మానకొండూరులో ఘోర కారు ప్రమాదం.. ఒకరు మృతి

by Bhanu |

కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం పరిధిలో గల అన్నారం & రాఘవపూర్ గ్రామాల మధ్య గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.

మానకొండూరులో ఘోర కారు ప్రమాదం.. ఒకరు మృతి
X

దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం పరిధిలో గల అన్నారం & రాఘవపూర్ గ్రామాల మధ్య గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, పచ్చునూరు గ్రామానికి చెందిన దాసారం నర్సయ్య (50) పచ్చునూరు తన స్వగ్రామంనుండి కారులో కరీంనగర్ వైపు బయలుదేరారు. మానకొండూరు గ్రామానికి చెందిన కొండ సంజీవ్ (45) కూడా అదే కారులో ఉన్నారు.

కారు అన్నారం & రాఘవపూర్ గ్రామాల మధ్య అదుపు తప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాసారం నర్సయ్య తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. కొండ్ర సంజీవ్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. 108 సిబ్బంది, పైలెట్ బి. శ్రీనివాస్ రెడ్డి, టెక్నీషియన్ ఎస్. తిరుపతి రెడ్డి తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడైన సంజీవ్‌ను మానకొండూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మానకొండూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.



Next Story