- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరీంనగర్ మేయర్ అభ్యర్థిగా మల్లికార్జున రాజేందర్?
ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుక్షణం నుంచి కరీంనగర్ మేయర్ ఎవరు అనే ఉత్కంఠ నెలకొంది. బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నం చేసినా అది బెడిసి కొట్టింది.

- ఉత్కంఠ రేపుతున్న కరీంనగర్ మేయర్ పీఠం
- ముందుగా మేయర్‌గా బీజేపీ రెబల్ అభ్యర్థి కొమురయ్య పేరు పరిశీలన
- ఆపై మల్లిఖార్జున రాజేందర్ పేరు ఖరారు?
- చక్రం తిప్పిన కాంగ్రెసు అధిష్టానం
- బీజేపీకి చేజారిన మేయర్ పీఠం
- ఉత్కంఠకు తెర.. మరికొద్దిసేపట్లో అధికారిక ప్రకటన
దిశ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ మేయర్ అభ్యర్థి ఎవరనే దానిపై రెండురోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో 30 స్థానాలు గెలిచిన బీజేపీ ముందుగా మేయర్ పీఠం మాదే అంటూ ప్రకటించినప్పటికీ అనూహ్యంగా మారిన పరిస్థితులు బీజేపీకి ప్రతికూలంగా మారాయి. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహత్మకంగా చక్రం తిప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో పార్వర్డ్ బ్లాక్, ఎంఐఎం పార్టీలతో చర్చలు జరిపి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు చర్చలు జరిపినట్టు సమాచారం. దీంతో కరీంనగర్ మేయర్ అభ్యర్థిగా ఎవరు సమర్థులు అనే దిశగా చర్చలు జరిపిన నేతలు.. ముందుగా బీజేపీ రెబల్ అభ్యర్థి కొమురయ్యను ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కాంగ్రెసు పార్టీ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందిన మల్లిఖార్జున రాజేందర్ పేరును పరిశీలనకు తీసుకున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అధిష్టానం మేయర్ అభ్యర్థిగా మల్లిఖార్జున రాజేందర్ ను ఫైనల్ చేసిన్నట్లు తెలుస్తోంది. గాంధీభవన్ నుంచి ఈ అర్థరాత్రివరకు అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.






