- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువతలో స్కిల్స్ పెంచేందుకు ప్రణాళికలు రూపొందించండి
జిల్లాలోని పరిశ్రమలు, ఆసుపత్రులు తదితర సేవా రంగ సంస్థల్లో యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు.

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : జిల్లాలోని పరిశ్రమలు, ఆసుపత్రులు తదితర సేవా రంగ సంస్థల్లో యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రైవేట్ పరిశ్రమలు, కంపెనీల ప్రతినిధులు, ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ రుచి గుప్తా తో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న ఉద్యోగాల కోసం అవసరమైన స్కిల్స్ యువత పెంచుకునేలా చూడాలన్నారు. తమ పరిశ్రమలు, కంపెనీల్లో పని చేసేందుకు అవసరమైన స్కిల్స్ కలిగిన అభ్యర్థుల కోసం జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారిని సంప్రదించాలని.. ప్రైవేటు పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు.
నైపుణ్యాలు పెంపొందించే ఐటిఐ, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకొనేలా చూడాలన్నారు. స్కిల్ అప్ గ్రేడ్ , స్కిల్ డెవలప్మెంట్ గురించి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. స్థానిక యువతలో స్కిల్స్ పెంచి ఉద్యోగాలు సాధించేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా ఉపాధి కల్పన శాఖ జాయింట్ డైరెక్టర్ రేఖా రాణి, డిప్యూటీ డైరెక్టర్ రమేష్ బాబు, ఉపాధి కల్పన శాఖ వరంగల్ రీజినల్ ఆఫీసర్ రవీందర్, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి తిరుపతిరావు, మెప్మా పీడీ స్వరూప రాణి, పరిశ్రమల శాఖ జిఎం సాల్మన్ రాజ్ , వివిధ శాఖల అధికారులు, టాటా, ఆదర్శ, వరుణ్ మోటార్స్, అపోలో, కరీంనగర్ డెయిరీ , రైస్ మిల్, గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధులు, మలబార్ గోల్డ్ కరీంనగర్ శాఖప్రతినిధులు పాల్గొన్నారు.






