- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవుడి పేరుతో దేశాన్ని అమ్ముతున్నారు - మహేష్ కుమార్ గౌడ్
దేవుడి పేరుతో దేశాన్ని అంబానీలకు అమ్ముకుంటున్న బీజేపీ నేడు అధికారంలో గద్దెనెక్కి ప్రజలను మోసం చేస్తోందని మహేష్ కుమార్

దిశ, రామడుగు, గంగాధర: దేవుడి పేరుతో దేశాన్ని అంబానీలకు అమ్ముకుంటున్న బీజేపీ నేడు అధికారంలో గద్దెనెక్కి ప్రజలను మోసం చేస్తోందని తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ప్రజాహిత కార్యక్రమంలో భాగంగా ముఖ్య కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో జరిగింది. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల పాలనలో పదవుల కోసం ఏనాడు కోరుకోలేదన్నారు. దానికి నిదర్శనమే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవిని కూడా త్యాగం చేశారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు సరిగ్గా చేరుతున్నాయా లేదా అనే ఉద్దేశంతో ఈ పాదయాత్రను చేస్తున్నట్లు వెల్లడించారు. కాలేశ్వరం పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం 1.20 లక్ష కోట్లు వృధా చేసిందన్నారు. భారతీయ జనతా పార్టీ 12 ఏళ్ల కాలంలో బండి సంజయ్.. కరీంనగర్ కు ఎన్ని పరిశ్రమలు తెచ్చారని నిలదీశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు పోరాటం చేస్తున్న తరుణంలో బిజెపి నలుగురు ఎంపీలు ఎందుకు నోరు మెదపడం లేదంటూ ఫైర్ అయ్యారు.






