- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూఢనమ్మకాలు వీడి.. శాస్త్రీయ దృక్పథంతో ఎదగాలి : మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని
విద్యార్థులు చిన్నతనం నుంచే మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ ప్రతి అంశాన్ని శాస్త్రీయంగా విశ్లేషించే అలవాటు చేసుకోవాలని హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని పిలుపునిచ్చారు.

దిశ, హుజూరాబాద్ రూరల్ : విద్యార్థులు చిన్నతనం నుంచే మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ ప్రతి అంశాన్ని శాస్త్రీయంగా విశ్లేషించే అలవాటు చేసుకోవాలని హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని పిలుపునిచ్చారు. మానవ వికాస వేదిక ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సైన్స్ టాలెంట్ టెస్ట్ విజేతలకు గురువారం హుజూరాబాద్‌లోని కాకతీయ జూనియర్ కాలేజీలో బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సమాజాభివృద్ధిలో సైన్స్ పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు. విద్యార్థులు సైన్స్ పద్ధతులు, విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని, గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఘనంగా బహుమతుల ప్రధానం
హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాల స్థాయిల్లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రతి పాఠశాల నుంచి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎంఈఓ వి. శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. మానవ వికాస వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొంటాల బుచ్చయ్య అధ్యక్షత వహించగా.. జిల్లా అధ్యక్షుడు భోగం రమేష్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కలకోటి వెంకటేష్, పేరుక సుందరయ్య, మాడుగుల ఓదెలు పాల్గొన్నారు.






