లేడీ చైన్ స్నాచ‌ర్ హ‌ల్ చ‌ల్

by Ratna Kumari |

లేడీ చైన్ స్నాచ‌ర్ హ‌ల్ చేసిన ఘ‌ట‌న పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

లేడీ చైన్ స్నాచ‌ర్ హ‌ల్ చ‌ల్
X

దిశ,పెద్దపల్లి : లేడీ చైన్ స్నాచ‌ర్ హ‌ల్ చేసిన ఘ‌ట‌న పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకుని సుమారు మూడు తులాల బంగారాన్ని అపహరించారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు చెరుకు రాజిరెడ్డి, వినోద ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా, వివాహాలై వేరే గ్రామాల్లో స్థిరపడ్డారు. గ్రామంలోని చెరుకు మహేందర్ రెడ్డి ఇంట్లో ఓ కార్యక్రమం జరుగుతుండగా.. రాజిరెడ్డి అక్కడికి వెళ్లారు. దీంతో వినోద ఇంట్లో ఒక్కరే ఉన్నారు. సరిగ్గా మధ్యాహ్నం స‌మ‌యంలో ముఖానికి ముసుగు ధరించిన ఓ గుర్తు తెలియని మహిళా వృద్ధురాలి ఇంటికి వచ్చింది. ఇంట్లో ఎవ్వ‌రు లేకపోవడాన్ని పసిగట్టి, వినోదను మాటల్లో పెట్టి ఆమె మెడలోని మూడు తులాల బంగారు ఆభరణాన్ని ఎత్తుకెళ్లింది. క్షణాల్లోనే ఈ ఘటన జరిగిపోవడంతో బాధితురాలు తేరుకునేలోపే ఆ గుర్తు తెలియని మహిళ అక్కడినుంచి పరారైంది. బాధితుల సమాచారం మేరకు.. పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చోరీ జరిగిన తీరును పరిశీలించి, బాధితురాలి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ముసుగు ధరించి వచ్చిన ఆ మహిళ ఎవరు అనే కోణంలో విచారణ చేప‌డుతున్నారు.

Next Story