దేశ సంరక్షణకు యువత నడుం బిగించాలి.. మైత్రి గ్రూప్ ఆఫ్ చైర్మన్ జైపాల్ రెడ్డి

by Disha Web |
దేశ సంరక్షణకు యువత నడుం బిగించాలి.. మైత్రి గ్రూప్ ఆఫ్ చైర్మన్ జైపాల్ రెడ్డి
X

దిశ, కరీంనగర్: దేశ సంరక్షణ కోసం నేటి ‌యువత నడుం బిగించాల్సిన అవసరం ఉందని మైత్రి గ్రూప్ ఆఫ్ ఛైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి, డిల్లీ డిఫెన్స్ అకాడమీ ఛైర్మన్ కొత్తపల్లి సతిష్ రెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్‌లోని స్థానిక లయోల కళాశాల అవరణలో జరిగిన కళాశాల వార్షికోత్సవంలో వారు మాట్లాడుతూ.. తమ కళాశాలలో శిక్షణ పొందిన నిరుద్యోగ యవకులు ఉద్యోగాలు సాధించారన్నారు. జనవరి 28 న వెలువడిన ఇండియన్ ఆర్మీ ఫలితాలలో వివిధ విభాగాలలో 218 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని తెలిపారు. అగ్నివీర్ జనరల్ ‌డ్యూటీ విభాగంలో 168, అలాగే అగ్ని వీర్ టెక్నీకల్ విభాగంలో 35 మంది, అగ్నీవీర్ ట్రెడ్స్సెన్ మరో 15 మంది యుకులు ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించ గలిగారని వారు కొనియాడారు. అభ్యర్థుల ఎంపిక విధానానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో శ్రద్ధ వహిస్తోందని, ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులకు ప్రశ్నల సరళిపై వివిధ విభాగాల్లో అవగాహన పెంపొందేలా ప్రతిరోజు పరీక్షలు నిర్వహిస్తుంటుందని తెలిపారు.

అలాగే వారి అభ్యసన సామర్థ్యాలు పెంచుకునేలా, లోపాలు తెలుసుకుని సవరించుకునేలా గ్రాండ్ టెస్టులని నిర్వహిస్తూ‌ వారు పరీక్షల్లో విజయం సాధించేలా నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రతి ఒక్కరికి ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలని, దాని కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. చేసే పనిని తపస్సు తో భావించాలి. అప్పుడే ప్రతి ఒక్కరు విజయం సాధించగలుతారని చెప్పారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ పరీక్షలకి అనుగుణంగా శారీరక, మానసిక అభ్యాసాలని విద్యార్థులకి అందిస్తుండడం వలన మా అకాడమీ విద్యార్థులు రాత, శారీరక పరీక్షల్లో విజయం సాధిస్తున్నారన్నారు. ఇంతటి విజయానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి సిబ్బందికి సతీష్ రెడ్డి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందం మరియు సిబ్బంది పాల్గొన్నారు.Next Story