కౌశిక్ రెడ్డి బోగ‌స్ ప్ర‌చారాలు మానుకోవాలి : వొడిత‌ల ప్ర‌ణ‌వ్

by Ratna Kumari |

దిశ, జమ్మికుంట టౌన్ : తనుగుల పరిధిలోని శంభునిపల్లి-గుంపుల చెక్ డ్యాంపై విచారణ కొనసాగుతుందనీ మరో నాలుగైదు రోజుల్లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పూర్తిస్థాయి నివేదికరాగానే

కౌశిక్ రెడ్డి బోగ‌స్ ప్ర‌చారాలు మానుకోవాలి : వొడిత‌ల ప్ర‌ణ‌వ్
X

దిశ, జమ్మికుంట టౌన్ : తనుగుల పరిధిలోని శంభునిపల్లి-గుంపుల చెక్ డ్యాంపై విచారణ కొనసాగుతుందనీ మరో నాలుగైదు రోజుల్లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పూర్తిస్థాయి నివేదికరాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. గురువారం రోజు జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో చెప్పినట్టు ప్రజాధనాన్ని ఎవరు దుర్వినియోగం చేసిన ఊరుకోమని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియాకు ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ నాయకులని, వాస్తవాలు తెలుసుకోకుండా హరీశ్ రావు మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని, ఒకవేళ చెక్ డ్యాం పేల్చితే దాని ఆనవాళ్లు చుట్టుపక్కల పరిసరాల్లో ఉంటాయి కదా చిన్న పటాకా పేలిస్తేనే చల్లా చదరవుతాయనీ అలాంటిది ఇంత పెద్ద చెక్ డ్యాం పేల్చారని ఆరోపణ చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు వాటి ఆనవాళ్లు చూపించడం లేదని అన్నారు. కరీంనగర్ వేదికగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు విసిరిన సవాల్ కు కౌశిక్ రెడ్డి స్పందించడం హాస్యాస్పదమన్నారు.


కాంక్రీట్ కి, గుండు రాయికి తేడా తెలియ‌ని వ్య‌క్తి కౌశిక్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. చెక్ డ్యాం పేల్చారు అని అంటున్న బీఆర్ఎస్ నాయకులు కాంక్రీట్ లో జిలేటిన్ స్టిక్స్ పెడతారా లేదా కుంగిన ప్రదేశం నుంచి దూరంగా ఉన్న బండరాలలో పెడతారా అని ప్రశ్నించారు?గతంలో మేము పరిశీలించినప్పుడు అక్కడ ఇలాంటి ఆనవాళ్లు ఏం కనబడలేదని, యధాస్థితిలో ఇల్లు నిర్మించేటప్పుడు కానీ చెక్ డ్యాం కట్టేటప్పుడు కానీ కింద రాళ్లు వేసి కడతారో అలాగే సమాంతరంగా రాళ్లు ఉన్నాయని, కౌశిక్ రెడ్డి మెదడు సరిగా పనిచేయదని అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని అన్నారు. నాసిరకమైన నిర్మాణం, కమీషన్ల కక్కుర్తి కోసం నిర్మాణాలు చేపట్టడం ద్వారానే ఇలాంటి నష్టం జరిగిందని, ఇసుకపై నిర్మాణం చేపట్టడం వలన ఇంతటి అనార్థం జరిగిందన్నారు. గతంలో 2022 లో కూడా ఈ చెక్ డ్యాం కుంగిందని ఇక్కడి రైతులే చెబుతున్నార‌ని.. దీంతోపాటు విలాసాగర్, తనుగుల, మల్లారెడ్డిపల్లి, పెద్దపల్లి జిల్లాలోని నాలుగు చెక్ డ్యామ్ లు ఆనాడు కూలిపోయాయని తెలిపారు.

Next Story