- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్థిక ఇబ్బందులు, ఇద్దరూ ఆడపిల్లలనే మనస్థాపంతో రైతు ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు, ఇద్దరు ఆడపిల్లలు అనే మనస్థాపనకి గురై రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, సైదాపూర్ : ఆర్థిక ఇబ్బందులు, ఇద్దరు ఆడపిల్లలు అనే మనస్థాపనకి గురై రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాయికల్ గ్రామానికి చెందిన రావుల తిరుపతిరెడ్డి (38) అనే రైతు వ్యవసాయం చేస్తూ జీవిస్తాడు. శనివారం రాత్రి 8 గంటలకు భార్య ఇద్దరు కుతుర్లతో కలిసి భోజనం చేసిన తర్వాత ఇద్దరు పిల్లలు భార్య ఇంటి బయట పడుకోగా తిరుపతి రెడ్డి బెడ్రూంలో కూలర్ వేసుకొని పడుకున్నాడు. ఆదివారం ఉదయం 5:30 గంటలకు వెళ్లి తలుపులు కొట్టగా తీయకపోవడంతో, ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో తలుపులను పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా చీరతో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కాగా మృతునికి 9, 6 సంవత్సరాల ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృతుని భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ట్రైనింగ్ ఎస్సై భార్గవ్ తెలిపారు.






