TSUTF Demand, కేజీబీవీలో మ్యూచువల్ బదిలీ దరఖాస్తుదారులకు న్యాయం చేయాలి...

by Disha Web Desk 1 |
TSUTF Demand, కేజీబీవీలో మ్యూచువల్ బదిలీ దరఖాస్తుదారులకు న్యాయం చేయాలి...
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : కేజీబీవీ ఉపాధ్యాయుల బదిలీల్లో మ్యూచువల్ బదిలీ దరఖాస్తుదారులకు న్యాయం చేయాలని టీఎస్ యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తిరుకొవెల శ్యామ్ సుందర్, అంబటి భూమేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలోని కథలాపూర్ కేజీబీవీ పాఠశాలలో ఇంగ్లీష్ సీఆర్టీ మ్యూచువల్ బదిలీ ద్వారా కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తికి బదిలీ చేసుకోగా ట్రయాంగిల్ ఎగ్జిస్టింగ్ బదిలీ పేరుతో మ్యూచువల్ బదిలీకి అంగీకరించిన వారికి మరోచోట పోస్టింగ్ ఇవ్వడం ఇబ్బందికరంగా మారిందన్నారు. దీంతో ఏళ్ల తరబడి బదిలీ కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయురాలికి అన్యాయం జరిగిందని తెలిపారు. ట్రయాంగిల్ ఎగ్జిస్టింగ్ బదిలీ పేరుతో పైరవీలు చేసుకున్న వారికి లబ్ధి చేకూర్చడం తగదన్నారు. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా ఆన్ లైన్ ద్వారా మ్యూచువల్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. కాసులకు కక్కుర్తిపడి అక్రమ బదిలీలు చేస్తున్నారని విమర్శించారు. నష్టపోయిన ఉపాధ్యాయురాలుకు కరీంనగర్ జిల్లాలోని మరో పాఠశాలకు పోస్టింగ్ ఇచ్చి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Next Story