పీఎంజే జ్యువెల‌రీ చోరీ కేసులో కింగ్ పిన్ సుభోధ్ సింగ్ క‌స్ట‌డీకి న్యాయ‌మూర్తి అనుమ‌తి

by Ratna Kumari |

క‌రీంన‌గ‌ర్ లోని పీఎంజే జ్యువెల‌రీ షాపులో మే 03న భారీ చోరీకి సంబంధించిన ఘ‌ట‌న‌లో కీల‌క సూత్ర‌దారిగా వ్య‌వ‌హ‌రించిన సుభోధ్ సింగ్ అలియాస్ బ‌బూవా ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గత శుక్రవారం కరీంనగర్ టూ టౌన్ పోలీసులు పీసీఆర్ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.

పీఎంజే జ్యువెల‌రీ చోరీ కేసులో కింగ్ పిన్ సుభోధ్ సింగ్ క‌స్ట‌డీకి న్యాయ‌మూర్తి అనుమ‌తి
X

దిశ‌, క‌రీంన‌గ‌ర్ లీగ‌ల్ : క‌రీంన‌గ‌ర్ లోని పీఎంజే జ్యువెల‌రీ షాపులో మే 03న భారీ చోరీకి సంబంధించిన ఘ‌ట‌న‌లో కీల‌క సూత్ర‌దారిగా వ్య‌వ‌హ‌రించిన సుభోధ్ సింగ్ అలియాస్ బ‌బూవా ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గత శుక్రవారం కరీంనగర్ టూ టౌన్ పోలీసులు పీసీఆర్ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి చిరాగ్ మెహత కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 7వ తేదీ వరకు సుభోధ్ సింగ్ అలియాస్ బబూవా పోలీసుల కస్టడీ లో ఉండనున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చోరీ మే 3 వ తేదీన జరగ్గా దుండగులు జ్యువెలరీ షాప్ నుంచి 161.4 తులాల బంగారం తో పాటు 112 క్యారెట్ల వజ్రాల ఆభరణాలను అపహారించుకుపోయారు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న కరీంనగర్ పోలీసులు బృందాలుగా ఏర్పడి దుండగుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి ఈ కేసుకు సంబంధించిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి విచారించగా బీహార్ లోని పూర్ణియా జైల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న సుభోధ్ సింగ్ అలియాస్ బబూవా ను పీఎంజె జ్యువెలరీ చోరీ కేసులో ప్రధాన సూత్రాధారిగా తేల్చారు.

జైల్లో ఉంటూనే ఈ చోరికి పథకం రచించినట్లు గుర్తించిన పోలీసులు అతన్ని కరీంనగర్ కు తీసుకువచ్చి న్యాయమూర్తి ముందు హాజరు పరచగా జైలుకు తరలించారు. కస్టడీ లోకి తీసుకొని ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టెందుకు అతన్ని విచారించాలని నిర్ణయించి సుభోధ్ సింగ్ అలియాస్ బాబువా ను తమ కస్టడీ కి అప్పగించాలని కోరుతూ కరీంనగర్ టూ టౌన్ పోలీసులు గత శుక్రవారం కరీంనగర్ లోని పీసీఆర్ కోర్టు లో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం విచారించిన న్యాయమూర్తి కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 7 వ తేది వరకు కస్టడీకి కోర్టు అనుమతించినప్పటికీ సుభోధ్ సింగ్ ను పూర్తి స్థాయిలో విచారించేందుకు ఈ సమయం సరిపోదని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. కస్టడీ సమయం ముగిసాక మరో సారి కస్టడీ పిటిషన్ దాఖలు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Next Story