సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా జయంత్

by Naveena |   (  Updated:2025-04-06 14:20:51  IST  )

సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఆకుల జయంత్ ఎన్నికయ్యారు.

సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా జయంత్
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఆకుల జయంత్ ఎన్నికయ్యారు. ఆదివారం హోరా హోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో జయంత్ 12 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థులపై ఘన విజయం సాధించారు. ఓటింగ్ ప్రక్రియ ఉదయం నుండి ఉత్కంఠంగా కొనసాగగా.. సాయంత్రం ఐదు గంటల వరకు పూర్తి ఫలితాలు వెలువడ్డాయి. కాగా స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులతో పాటు స్థానిక ప్రజలు ఈ ఎన్నికపై ఎంతో ఆసక్తి కనబరిచారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఆకుల జయంత్ కు క్లబ్ సభ్యులు రెండవసారి అధ్యక్షునిగా పట్టం కట్టగా, ప్రధాన కార్యదర్శిగా ఆడెపు మహేందర్, ఉపాధ్యక్షుడిగా బొడ్డు పర్శరాములు, సహాయ కార్యదర్శిగా కంకణాల శ్రీనివాస్, కోశాధికారిగా వంకాయల శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులుగా చౌటపల్లి వెంకటేష్, బుస్సా రామనాథం, దుమాల రాము, జంగిలి రాజు, ముండ్రాయి శ్రీనివాస్, ప్రయాకర్ రావు వేణులు ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుపొందారు.

గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు తడుక విశ్వనాథం, కంకణాల భద్రాచలం, టివి నారాయణలు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జయంత్ మాట్లాడుతూ .. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తానని, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు పాటుపడుతానన్నారు. జర్నలిస్టుల ఇంటి స్థలాలతో పాటు నూతన ఇంటి నిర్మాణానికి కూడా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమపై నమ్మకంతో తమకు ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించిన ప్రెస్ క్లబ్ సభ్యులకు అధ్యక్షుడితో పాటు నూతన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని పలువురు ప్రజాప్రతినిధులతో పాటు ప్రముఖులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

Next Story